Bigg Boss Telugu 9 Grand Finale: తనూజ వర్సెస్ కల్యాణ్.. ఈసారి బిగ్‌బాస్ కప్పు కొట్టేది ఎవరో AI చెప్పేసిందిగా..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి జరిగే ఈ ఎపిసోడ్ తో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్ టైటిల్ అందుకునేది ఎవరన్న దానిపై ఏఐ ఆసక్తికర సమాధానమిచ్చింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఆదివారం (డిసెంబర్ 21) జరిగే ఈ ఎపిసోడ్ తో ఈ బిగ్ బాస్ సీజన్ కు ఎండ్ కార్డ్ పడనుంది. అలాగే ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారోనని తెలుసుకునేందుకు ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. . సెప్టెంబర్ 7, 2025న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ తమ అదృష్టం పరీక్షించుకున్నారు. కామనర్లు, సెలబ్రిటీలుగా విడిపోయి ఆడియెన్స్ కు వినోదం అందించారు. ఇక ఇప్పుడు రియాలిటీ షో తుది అంకానికి చేరుకుంది. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడనున్నారు. తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ లో ఎవరో ఒకరు బిగ్ బాస్ ట్రోఫీ అందుకోనున్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా జరిగింది.
లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం, ఓటింగ్ ట్రెండ్స్‌లో తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. కొన్ని సోర్సెస్ ప్రకారం తనూజ ముందంజలో ఉండగా, మరికొన్ని మాత్రం పవన్ కల్యాణ్‌ను విజేతగా చూపిస్తున్నాయి. వీరిద్దరి మధ్యలో నేనున్నానంటూ డీమాన్ పవన్ కూడా దూసుకొచ్చాడు. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్‌తో అతను మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం వీరు టాప్-3లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మాన్యయేల్, సంజన ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
AI ఏం చెప్పిందంటే?
కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నదానిపై ఆసక్తికర సమాధానమిచ్చింది. లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్, సోషల్ మీడియా బజ్ తదితర అంశాలను విశ్లేషించి బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడని AI అంచనా వేసింది. ఇందుకు గల కారణాలను కూడా ఏఐ విశ్లేషించింది. కల్యాణ్ ఫ్యాన్ బేస్ మాసివ్‌గా ఓటింగ్ చేస్తోందని, సైలెంట్ వోటర్స్ కూడా అతనికే ఎక్కువగా సపోర్టుగా ఉన్నారని AI తేల్చింది. ఇక తనూజ రన్నరప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని కూడా AI అంచనా వేసింది. డీమాన్ పవన్‌కి మంచి సపోర్ట్ ఉంది కానీ టాప్ 2కు చేరడం కష్టం అని AI విశ్లేషించింది. మరి ఏఐ చెప్పింది నిజమో? కాదో? తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
Memories rewind, party begins in the house! 🏠❤️✨
Watch #BiggBossTelugu9 Mon–Fri 10:00 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/A36aFq8fOu
— Starmaa (@StarMaa) December 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








