Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ధోని vs రోహిత్ మ్యాచ్ చూడాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిందే.. ఒక్కో టిక్కెట్ ధరెంతో తెలుసా?

IPL 2025 CSK vs MI Tickets: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. అంతకు ముందే ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం, చెన్నై వర్సెస్ ముంబై మధ్య జరిగే మ్యాచ్ టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయి. వాటి ధర లక్షల్లో చేరుకుంది.

IPL 2025: ధోని vs రోహిత్ మ్యాచ్ చూడాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిందే.. ఒక్కో టిక్కెట్ ధరెంతో తెలుసా?
Ipl 2025 Csk Vs Mi Tickets
Follow us
Venkata Chari

|

Updated on: Mar 13, 2025 | 7:38 AM

IPL 2025 CSK vs MI Tickets: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత, ఇప్పుడు ఐపీఎల్ 2025 మాయాజాలం వ్యాపించడం ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ గురించి షాకింగ్ వార్తలు వస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఘర్షణకు ముందు, ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం చెన్నై మ్యాచ్‌ల కోసం ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టిక్కెట్ల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నారు. దిగువ స్థాయి టిక్కెట్లు బ్లాక్ మార్కెట్‌లో పది రెట్లు ధరకు అమ్ముడవుతున్నాయంటే, ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో చూడొచ్చు. చెన్నై తన సొంత మ్యాచ్‌లకు అధికారిక టిక్కెట్ల అమ్మకాన్ని ఇంకా ప్రారంభించనప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే, ఇక టిక్కెట్లు మొదలైన వెంటనే ప్రైజ్ ఎలా ఉండబోతుందో జస్ట్ శాంపిల్ చూపించారు.

చెన్నై vs ముంబై మ్యాచ్ టిక్కెట్లు లక్షల్లో డిమాండ్..!

టికెట్ రీసేల్ వెబ్‌సైట్ వయాగోగో ప్రకారం, చెన్నై vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం కేఎంకే లోయర్ స్టాండ్ టిక్కెట్ల ధర ₹85,380కి చేరుకుంది. ఈ స్టాండ్‌కి 84 టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ధర ₹12,512గా ఉంది. 6 చెన్నై హోమ్ గేమ్‌ల టిక్కెట్లు ప్రస్తుతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే మార్చి 28న జరిగే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టిక్కెట్లు ఇంకా అందుబాటులో లేవు.

టిక్కెట్ల కోసం విపరీతమైన క్రేజ్..

ఐపీఎల్ 2025 టిక్కెట్ల క్రేజ్ క్రికెట్ ప్రేమికులు ఈ టోర్నమెంట్ పట్ల ఎంత ఉత్సాహంగా ఉన్నారో స్పష్టంగా చూపిస్తుంది. చెన్నై (CSK vs MI) వర్సెస్ ముంబై మధ్య జరిగే మ్యాచ్ ఎల్లప్పుడూ IPLలో అతిపెద్ద, అత్యంత ఉత్తేజకరమైన మ్యాచ్‌గా పరిగణిస్తున్నారు. ఈసారి కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారో కనిపిస్తుంది. అయితే, టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ అనేది ఐపీఎల్ నిర్వహణ, స్థానిక పరిపాలన దృష్టి సారించాల్సిన తీవ్రమైన సమస్యగా మారింది.

ఇవి కూడా చదవండి

CSK IPL 2025 షెడ్యూల్..

VS ముంబై ఇండియన్స్ MA చిదంబరం స్టేడియం, చెన్నై మార్చి 23 రాత్రి 7:30 గంటలకు

Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు MA చిదంబరం స్టేడియం, చెన్నై మార్చి 28 రాత్రి 7:30 గంటలకు

VS రాజస్థాన్ రాయల్స్ బర్సపర క్రికెట్ స్టేడియం, గౌహతి మార్చి 30 సాయంత్రం 7:30

VS ఢిల్లీ క్యాపిటల్స్ MA చిదంబరం స్టేడియం, చెన్నై 5 ఏప్రిల్ సాయంత్ర 3:30 గంటలకు

VS పంజాబ్ కింగ్స్ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం, ముల్లన్పూర్ 8 ఏప్రిల్ రాత్రి 7:30 గంటలకు

VS కోల్‌కతా నైట్ రైడర్స్ MA చిదంబరం స్టేడియం, చెన్నై 11 ఏప్రిల్ రాత్రి 7:30 గంటలకు

VS లక్నో సూపర్ జెయింట్స్ ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో 14 ఏప్రిల్ రాత్రి 7:30 గంటలకు

VS ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియం, ముంబై 20 ఏప్రిల్ రాత్రి 7:30 గంటలకు

VS సన్‌రైజర్స్ హైదరాబాద్ MA చిదంబరం స్టేడియం, చెన్నై ఏప్రిల్ 25 రాత్రి 7:30 గంటలకు

VS పంజాబ్ కింగ్స్ MA చిదంబరం స్టేడియం, చెన్నై ఏప్రిల్ 30 సాయంత్రం 7:30 గంటలకు

Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు 3 మే రాత్రి 7:30 గంటలకు

VS కోల్‌కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా మే 7 రాత్రి 7:30 గంటలకు

VS రాజస్థాన్ రాయల్స్ MA చిదంబరం స్టేడియం, చెన్నై మే 12 రాత్రి 7:30 గంటలకు

VS గుజరాత్ టైటాన్స్ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ మే 18 మధ్యాహ్నం 3:30 గంటలకు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..