CSK vs SRH, IPL 2024: చెలరేగిన చెన్నై బౌలర్లు.. 78 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన హైదరాబాద్

Chennai Super Kings vs Sunrisers Hyderabad: చెన్నై సూపర్ కింగ్స్ బదులు తీర్చుకుంది. గత వారం హైదరాబాద్ చేతిలో ఎదురైన ఓటమికి ఇప్పుడు సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఆదివారం (ఏప్రిల్ 28) రాత్రి చెన్నై వేదికగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

CSK vs SRH, IPL 2024: చెలరేగిన చెన్నై బౌలర్లు.. 78 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన హైదరాబాద్
Chennai Super Kings vs Sunrisers Hyderabad
Follow us
Basha Shek

|

Updated on: Apr 29, 2024 | 12:17 AM

Chennai Super Kings vs Sunrisers Hyderabad: చెన్నై సూపర్ కింగ్స్ బదులు తీర్చుకుంది. గత వారం హైదరాబాద్ చేతిలో ఎదురైన ఓటమికి ఇప్పుడు సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఆదివారం (ఏప్రిల్ 28) రాత్రి చెన్నై వేదికగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్ లోనూ సమష్టిగా రాణించిన చెన్నై ఆల్ రౌండ్ ఫెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ముందుగాటాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా, డేరిల్ మిచెల్ 2 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 52 పరుగులు చేశాడు. ఆఖరులో శివమ్ దూబే ( 20 బంతుల్లో 29 నాటౌట్, ఒక ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు పెరిపించాడు. ఇక ఆ తర్వాత 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ కు దిగిన హైదరాబాద్ ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయింది. చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంలో‌ 18.5 ఓవర్లలో కేవలం 134 పరుగులకే ఎస్ ఆర్ హెచ్ ఆలౌట్‌ అయింది. ఆ జట్టులో మార్‌క్రమ్‌ ( 26 బంతుల్లో 32, 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. ట్రావిస్‌ హెడ్‌ (13), అభిషేక్‌ శర్మ (15), అన్మోల్‌ప్రీత్‌సింగ్‌ (0), నితీశ్‌ రెడ్డి (15), క్లాసెన్‌ (20) సమద్‌ (19) తీవ్రంగా నిరాశ పరిచారు. చెన్నై బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే (4/22) హైదరాబాద్ టాపార్డర్‌ను దెబ్బతీశాడు. పతిరన, ముస్తాఫిజుర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీషా పతిరానా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐదాన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?