Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో బలహీనమైన జట్టు ఇదే.. కారణం ఏంటో తెలుసా?
Players Ruled out from Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ అభిమానులను అలరించేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే అన్ని జట్లు తమ్ స్క్వాడ్‌లను సిద్ధం చేసుకున్నాయి. అయితే, కొంతమంది ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకోవడం ఆయా జట్లకు ఇబ్బందిగా మారింది. ఈ లిస్ట్‌లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

Players Ruled out from Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ టోర్నమెంట్ ప్రారంభానికి సరిగ్గా 5 రోజులు మిగిలి ఉన్నాయి. హైబ్రిడ్ మోడల్ కింద పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ ప్రయాణం ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. దీని కోసం అన్ని జట్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. ఐసీసీ గడువు నాటికి అన్ని జట్లు తమ స్వ్కాడ్‌లను సిద్ధం చేశాయి.
ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా మంది గొప్ప ఆటగాళ్ళు ఆడుతున్నారు. కానీ, కొంతమంది స్టార్ ఆటగాళ్ళు అనుకోకుండా తప్పుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో భాగం కావడం లేదు. వారిలో కొందరు గాయం కారణంగా దూరంగా ఉండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉండే ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..
1. ఆఫ్ఘనిస్తాన్..
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఆడబోతున్న అఫ్గానిస్తాన్ జట్టు కూడా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ జట్టు యువ స్పిన్ బౌలర్, అల్లా గజన్‌ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ, అతను ఇప్పుడు బయటపడ్డాడు.
2. దక్షిణాఫ్రికా..
ప్రపంచ క్రికెట్‌లోని ప్రధాన టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికా జట్టు తరచుగా అద్భుతమైన ప్రదర్శనను ఇస్తుంది. దక్షిణాఫ్రికాలో అతిపెద్ద ఎక్స్-ఫ్యాక్టర్ ఈ టోర్నమెంట్ మొదటి ఎడిషన్ విజేత అన్రిచ్ నార్ట్జే నిష్క్రమించాడు. అతను గాయం కారణంగా దూరమయ్యాడు. ఇది ప్రోటీస్‌కు పెద్ద దెబ్బ.
3. పాకిస్తాన్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన పాకిస్తాన్ ఈసారి ఆతిథ్యమిస్తోంది. కానీ, దక్షిణాఫ్రికా పర్యటనలో ఆతిథ్య జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ సామ్ అయూబ్ గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు.
4. ఇంగ్లాండ్..
క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోవాలని చూస్తోంది. కానీ, ఈ జట్టు ఫామ్ ప్రస్తుతం తీవ్రంగా ప్రభావితమైంది. జట్టు పేలవమైన ప్రదర్శనతో పాటు, యువ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్‌ను జట్టులోకి తీసుకోకపోవడం పెద్ద దెబ్బగా మానింది.
5. ఆస్ట్రేలియా..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు ఈసారి టోర్నమెంట్ ఒక పీడకలగా మారవచ్చు. ఈ జట్టులోని కొంతమంది ఆటగాళ్ళు గాయం కారణంగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. ఇందులో కెప్టెన్ పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా ఆడటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల మిచెల్ స్టార్క్ తన పేరును ఉపసంహరించుకోగా, మార్కస్ స్టోయినిస్ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు.
6. భారతదేశం..
భారత క్రికెట్ జట్టు లమైన పోటీదారుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెడుతోంది. కానీ, టీం ఇండియా అతిపెద్ద మ్యాచ్ విన్నర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఔట్ అయ్యాడు. ఈ ఆటగాడి తొలగింపు టీం ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.