CWC Awards List: గోల్డెన్ బ్యాట్ నుంచి గోల్డెన్ బాల్ వరకు.. ప్రపంచకప్‌లో అవార్డులు గెలిచిన ఆటగాళ్లు వీరే..
ICC World Cup Awards List: ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు గోల్డెన్ బ్యాట్ అవార్డు ఇవ్వబడుతుంది. ICC గోల్డెన్ బ్యాట్ అవార్డును 1975లో ప్రారంభించారు. ఈసారి గోల్డెన్ బ్యాట్ అవార్డు గెలుచుకునే రేసులో విరాట్ కోహ్లీ ముందున్నాడు.

CWC Awards List: నవంబర్ 19, 2023న భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు ఐదుసార్లు ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్, వెస్టిండీస్‌లు చెరో రెండుసార్లు ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్‌లు ఒక్కోసారి ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి. ప్రతి ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ పలు అవార్డులను అందజేస్తుంది. ఆ అవార్డులు ఏంటో ఓసారి చూద్దాం..
గోల్డెన్ బ్యాట్ అవార్డు..
ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు గోల్డెన్ బ్యాట్ అవార్డును అందజేస్తారు. ICC గోల్డెన్ బ్యాట్ అవార్డును 1975లో ప్రారంభించారు. ఈసారి గోల్డెన్ బ్యాట్ అవార్డు గెలుచుకునే రేసులో విరాట్ కోహ్లీ ముందున్నాడు. గోల్డెన్ బాల్ గెలుచుకునే రేసులో మహ్మద్ షమీ, ఆడమ్ జంపా ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో గోల్డెన్ బ్యాట్‌ను గెలుచుకున్న బ్యాట్స్‌మెన్‌ల జాబితా ఇదే..
IND vs AUS: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా లైవ్ బ్లాగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




ప్రపంచ కప్ | బ్యాట్స్ మెన్ | దేశం | పరుగులు |
---|---|---|---|
1975 | గ్లెన్ టర్నర్ | న్యూజిలాండ్ | 333 |
1979 | గార్డెన్ గ్రీన్స్ | వెస్ట్ ఇండీస్ | 253 |
1983 | డేవిడ్ గోవర్ | ఇంగ్లండ్ | 384 |
1987 | గ్రాహం గూచ్ | ఇంగ్లండ్ | 471 |
1992 | మార్టిన్ క్రోవ్ | న్యూజిలాండ్ | 456 |
1996 | సచిన్ టెండూల్కర్ | భారతదేశం | 523 |
1999 | రాహుల్ ద్రవిడ్ | భారతదేశం | 461 |
2003 | సచిన్ టెండూల్కర్ | భారతదేశం | 673 |
2007 | మాథ్యూ హేడెన్ | ఆస్ట్రేలియా | 659 |
2011 | తిలకరత్నే దిల్షాన్ | శ్రీలంక | 500 |
2015 | మార్టిన్ గప్టిల్ | న్యూజిలాండ్ | 547 |
2019 | రోహిత్ శర్మ | భారతదేశం | 648 |
గోల్డెన్ బాల్ అవార్డు..
అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి గోల్డెన్ బాల్ అవార్డును అందజేస్తారు. 1975లో తొలిసారిగా ఈ అవార్డు లభించింది. ప్రస్తుతం దీనిని “ఐసీసీ గోల్డెన్ బాల్” అని పిలుస్తున్నారు. ఈ అవార్డు అందుకున్న బౌలర్ల జాబితాలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ కప్ | బౌలర్ | దేశం | వికెట్లు |
---|---|---|---|
1975 | గ్యారీ గిల్మోర్ / బెర్నార్డ్ జూలియన్ | ఆస్ట్రేలియా/వెస్టిండీస్ | 11/11 |
1979 | మైక్ హెడ్రిక్ | ఇంగ్లండ్ | 10 |
1983 | రోజర్ బిన్నీ | భారతదేశం | 18 |
1987 | క్రెయిగ్ మెక్‌డెర్మోట్ | ఆస్ట్రేలియా | 18 |
1992 | వసీం అక్రమ్ | పాకిస్తాన్ | 18 |
1996 | అనిల్ కుంబ్లే | భారతదేశం | 15 |
1999 | జెఫ్ అలాట్ / షేన్ వార్న్ | న్యూజిలాండ్ / ఆస్ట్రేలియా | 20/20 |
2003 | చమిందా వాస్ | శ్రీలంక | 23 |
2007 | గ్లెన్ మెక్‌గ్రాత్ | ఆస్ట్రేలియా | 26 |
2011 | జహీర్ ఖాన్/ షాహిద్ అఫ్రిది | భారతదేశం/పాకిస్తాన్ | 21/21 |
2015 | మిచెల్ స్టార్క్/ట్రెంట్ బౌల్ట్ | ఆస్ట్రేలియా/న్యూజిలాండ్ | 22/22 |
2019 | మిచెల్ స్టార్క్ | ఆస్ట్రేలియా | 27 |
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్..
ప్రపంచ కప్ టోర్నమెంట్ అంతటా ప్రతి విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇవ్వబడుతుంది. 1992లో తొలిసారిగా ఈ అవార్డు లభించింది. ప్రస్తుతం “ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్”గా పిలుస్తున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
సంవత్సరం | ఆటగాడు | దేశం | బెస్ట్ |
---|---|---|---|
1992 | మార్టిన్ క్రోవ్ | న్యూజిలాండ్ | 456 పరుగులు |
1996 | సనత్ జయసూర్య | శ్రీలంక | 221 పరుగులు, 6 వికెట్లు |
1999 | లాన్స్ క్లూజ్నర్ | దక్షిణ ఆఫ్రికా | 281 పరుగులు, 17 వికెట్లు |
2003 | సచిన్ టెండూల్కర్ | భారతదేశం | 673 పరుగులు, 2 వికెట్లు |
2007 | గ్లెన్ మెక్‌గ్రాత్ | ఆస్ట్రేలియా | 26 వికెట్లు |
2011 | యువరాజ్ సింగ్ | భారతదేశం | 362 పరుగులు, 15 వికెట్లు |
2015 | మిచెల్ స్టార్క్ | ఆస్ట్రేలియా | 22 వికెట్లు |
2019 | కేన్ విలియమ్సన్ | న్యూజిలాండ్ | 578 పరుగులు, 2 వికెట్లు |
ఫైనల్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..
ప్రపంచకప్ ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి ఈ అవార్డును అందజేస్తారు. 1975లో తొలిసారిగా ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
సంవత్సరం | ఆటగాడు | బెస్ట్ |
---|---|---|
1975 | క్లైవ్ లాయిడ్ | 102 పరుగులు |
1979 | వివియన్ రిటార్డ్స్ | 138* పరుగులు |
1983 | మొహిందర్ అమర్‌నాథ్ | 3 వికెట్లు, 26 పరుగులు |
1987 | డేవిడ్ బూన్ | 75 పరుగులు |
1992 | వసీం అక్రమ్ | 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు |
1996 | అరవింద్ డిసిల్వా | 107* పరుగులు, 3 వికెట్లు |
1999 | షేన్ వార్న్ | 4 వికెట్లు |
2003 | రికీ పాంటింగ్ | 140* పరుగులు |
2007 | ఆడమ్ గిల్‌క్రిస్ట్ | 149 పరుగులు |
2011 | మహేంద్ర సింగ్ ధోని | 91* పరుగులు |
2015 | జేమ్స్ ఫాల్క్‌నర్ | 3 వికెట్లు |
2019 | బెన్ స్టోక్స్ | 84* పరుగులు |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..