India Vs Australia Final: మహాసంగ్రామానికి వేళాయే.. అంతటా నరాలు తెగే ఉత్కంఠ.. ప్రపంచ కప్ లైవ్ వీడియో..
IND Vs AUS WC Final: మహాసంగ్రామానికి వేళైంది. 12ఏళ్ల కలసాకారానికి మరికొద్ది గంటలే మిగిలి ఉంది. ఈసారి ప్రపంచ్ కప్ కొట్టడమే లక్ష్యంగా రోహిత్ సేన మాంచి కసిమీద ఉంది. అందుకు 140 కోట్ల భారతీయుల ఆశీస్సులు సైతం ఉండడంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాక్టీస్ చేస్తోంది. 12ఏళ్లుగా ఊరిస్తున్న కలను సాకారం చేసిచూపుతామంటూ ధీమా వ్యక్తంచేస్తోంది.

IND Vs AUS WC Final: మహాసంగ్రామానికి వేళైంది. 12ఏళ్ల కలసాకారానికి మరికొద్ది గంటలే మిగిలి ఉంది. ఈసారి ప్రపంచ్ కప్ కొట్టడమే లక్ష్యంగా రోహిత్ సేన మాంచి కసిమీద ఉంది. అందుకు 140 కోట్ల భారతీయుల ఆశీస్సులు సైతం ఉండడంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాక్టీస్ చేస్తోంది. 12ఏళ్లుగా ఊరిస్తున్న కలను సాకారం చేసిచూపుతామంటూ ధీమా వ్యక్తంచేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు హెలికాప్టర్లతో ఎయిర్‌షోకు సిద్ధమయ్యారు నిర్వాహకులు. ఆస్ట్రేలియాతో మధ్యాహ్నం జరిగే పోరుకోసం యావత్ దేశం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒంటి గంట 35 నిమిషాల నుంచి 1:50 నిమిషాల వరకూ సుమారు 15 నిమిషాల పాటు ఎయిర్ షో నిర్వహించనుంది బీసీసీఐ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఈ ఎయిర్‌షో చేపట్టనుంది.




