Viral Video: ఓర్నీ.. సింపుల్ రనౌట్ ఛాన్స్‌ను అలా ఎలా మిస్ చేశావ్ బ్రో! నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో
మ్యాచ్‌లో బౌలర్.. రనౌట్ ఛాన్స్‌ను మిస్ చేసిన తీరు నవ్వులు పూయిస్తుంది. చేతికి వచ్చిన బంతితో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఉన్న వికెట్లను కొట్టడంలో బౌలర్ విఫలం కావడంతో బ్యాటర్లకు కలిసివచ్చింది.

సీరియస్‌గా సాగే క్రికెట్ మ్యాచ్‌ల్లో అప్పుడప్పుడూ కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అవి ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను కూడా కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇక యూరోపియన్ క్రికెట్ లీగ్ లాంటి క్లబ్ టోర్నమెంట్లలో నిత్యం ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. తాజాగా అలాంటిదే మరొక సరదా సంఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. మ్యాచ్‌లో బౌలర్.. రనౌట్ ఛాన్స్‌ను మిస్ చేసిన తీరు నవ్వులు పూయిస్తుంది. చేతికి వచ్చిన బంతితో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఉన్న వికెట్లను కొట్టడంలో బౌలర్ విఫలం కావడంతో బ్యాటర్లకు కలిసివచ్చింది. యూరోపియన్ క్రికెట్ సిరీస్ టి10 మాల్టా లీగ్‌లో బుగిబ్బా బ్లాస్టర్స్, స్వీకీ యునైటెడ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లోఈ సరదా సంఘటన చోటు చేసుకోగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్లాస్టర్స్ బ్యాటింగ్ సమయంలో బౌలర్ విబోర్ యాదవ్ వేసిన బంతిని బ్యాటర్ వదిలేశాడు. దీంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజును దాటి రన్ తీసేందుకు ప్రయత్నం చేశాడు. ఇంతలోనే కీపర్ బంతిని నేరుగా బౌలర్‌కు విసిరాడు. బంతిని సక్రమంగానే అందుకున్న విబోర్ వికెట్లకు కొట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. ఏదో దూరం నుంచి మిస్ చేశాడంటే పర్వాలేదు.. కానీ ఒక అడుగు దూరం నుంచి అది కూడా పాయింట్ బ్లాక్ రేంజ్‌లో రనౌట్ చేయలేకపోవడం విడ్డూరంగా అనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఓర్నీ.. ఇంత సింపుల్ రనౌట్‌ను ఎలా మిస్ చేశావ్ బ్రో’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.




Power ✅ Accuracy ❌
Missed from point-blank range? #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether #CricketinMalta pic.twitter.com/xTORBNPQx6
— European Cricket (@EuropeanCricket) February 6, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
