Babar Azam: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా షి’కారు’.. పాక్ కెప్టెన్‌కు భారీగా జరిమానా.. మళ్లీ ట్రోల్స్ షురూ
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌కు రెండుసార్లు జరిమానా విధించారు పోలీసులు. ఇటీవల తన లగ్జరీ కారును తీసుకుని రోడ్డెక్కిన బాబర్ నిబంధనలకు విరుద్ధంగా వన్‌వేలో పోనిచ్చాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు బాబర్ కారును ఆపారు. అనంతరం బాబర్ నుంచి కారు పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. అయితే బాబర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని తేలింది. దీంతో వన్ వేలో కారు నడిపినందుకు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కినందుకు కానూ పాకిస్థాన్ కెప్టెన్‌కు

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌కు రెండుసార్లు జరిమానా విధించారు పోలీసులు. ఇటీవల తన లగ్జరీ కారును తీసుకుని రోడ్డెక్కిన బాబర్ నిబంధనలకు విరుద్ధంగా వన్‌వేలో పోనిచ్చాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు బాబర్ కారును ఆపారు. అనంతరం బాబర్ నుంచి కారు పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. అయితే బాబర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని తేలింది. దీంతో వన్ వేలో కారు నడిపినందుకు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కినందుకు కానూ పాకిస్థాన్ కెప్టెన్‌కు పోలీసులు రూ.2000 జరిమానా విధించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..ఆసియా కప్ సూపర్ 4 రౌండ్‌లో ఘోర పరాజయం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బాబర్ సెప్టెంబర్ 17న లాహోర్‌లోని గుల్బర్గ్ ప్రాంతంలో తన లగ్జరీ కారులో వన్-వే ట్రిప్ తీసుకున్నాడు. ఇక్కడే బాబర్‌ను ఆపిన పోలీసులు అన్నీ చెక్ చేయగా అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేలింది. కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు బాబర్. తాజాగా ఈ విషయం బయటపడడంతో మళ్లీ అతనిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్స్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారెందుకు నడుపుతున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈసారి ఆసియా కప్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగింది పాకిస్థాన్. అయితే భారత్ చేతిలో దారుణ పరాజయంతో సూపర్ 4 రౌండ్ లోనే ఇంటి బాట పట్టింది. ఇక ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో మనస్తాపానికి గురైన బాబర్ డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో వాగ్వాదానికి దిగాడని కూడా వార్తలు వచ్చాయి. అలాగే బాబర్ ఒంటెద్దు పోకడతో జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారంటూ పుకార్లు వచ్చాయి. అయితే మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ పుకార్లన్నీ అవాస్తవాలని కొట్టిపారేశాడు బాబర్.
మరోవైపు ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు ఈరోజు భారత్‌కు రానుంది. శుక్రవారం( సెప్టెంబర్ 29) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో బాబర్ సేన తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు కివీస్ జట్టులోని కొందరు ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సాయంత్రానికి మిగతా ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకుంటారు.ఇక పాక్ జట్టు ఆటగాళ్లు ఈరోజు సాయంత్రానికి దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరికి బంజారాహిల్స్‌లో ఉన్న పార్క్ హయత్ హోటల్‌లో పాక్ జట్టు వసతిని కల్పించగా.. న్యూజిలాండ్ ప్లేయర్లకు ఐటీసీ కాకతీయలో బసను ఏర్పాటు చేశారు. కాగా భద్రతా కారణాల దృష్ట్యా వార్మప్ మ్యాచ్‌కు ప్రేక్షకులు అనుమతించడం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




