World Cup 2023: మెగా టోర్నీకి ముందు బంగ్లా జట్టులో హైడ్రామా.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని బోర్డుకి షకీబ్ బెదిరింపులు..!
ODI World Cup 2023: అసలు టోర్నీ ప్రారంభంకాక ముందే బంగ్లాదేశ్ క్రికెట్‌లో హైడ్రామా నెలకొంది. వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ తమ 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. అయితే ఈ జట్టులో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బల్‌కి అవకాశం లభించలేదు. రిటైర్ అయిన ఆటగాడిని మళ్లీ ఆటలోకి రావాలని కోరిన బంగ్లాదేశ్.. మెగా టోర్నీకి ఎంపిక చేయకపోవడం..

ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక మెగా టోర్నీ అంటే చివరి బంతి వరకు హైడ్రామా కొనసాగడం సహజమే. అయితే అసలు టోర్నీ ప్రారంభంకాక ముందే బంగ్లాదేశ్ క్రికెట్‌లో హైడ్రామా నెలకొంది. వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ తమ 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. అయితే ఈ జట్టులో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బల్‌కి అవకాశం లభించలేదు. రిటైర్ అయిన ఆటగాడిని మళ్లీ ఆటలోకి రావాలని కోరిన బంగ్లాదేశ్.. మెగా టోర్నీకి ఎంపిక చేయకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై బంగ్లాదేశ్ స్థానిక మీడియా ప్రకారం వరల్డ్ కప్ టోర్నీ ఆడే బంగ్లా జట్టులో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బల్ ఉంటే తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి, అలాగే టీమ్ నుంచి తప్పుకుంటానంటూ షకిబ్ అల్ హాసన్ బెదిరించాడు. ఈ కారణంగానే తమీమ్‌ని టోర్నీకి దూరం పెట్టారని తెలుస్తోంది.
నివేదిక ప్రకారం అసలు విషయం ఏమిటంటే.. తమీమ్ ఇక్బాల్ పూర్తిగా ఫిట్‌గా లేడు. దీంతో ప్రపంచ కప్ టోర్నీ మొత్తం ఆడలేనని, 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలనని బోర్డ్‌కి తెలిపాడు. కానీ తమీమ్ అభ్యర్థనతో ఏకీభవించని షకిబ్ అల్ హాసన్.. పూర్తిగా ఫిట్‌నెస్ లేని ఆటగాడిని ఎంపిక చేస్తే కెప్టెన్సీ నుంచి, జట్టు నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశాడు. కెప్టెన్ నిర్ణయం స్పష్టంకావడంతో చేసేది లేక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ జట్టు నుంచి తమీమ్‌ని పక్కన పెట్టింది. ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక అయిన 15 మంది బంగ్లా జట్టును షకిబ్ అల్ హాసన్ నడిపిస్తుండగా.. నజ్ముల్ హుసేన్ షాంటో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
View this post on Instagram
Introducing the men in Green and Red for the World Cup. 🇧🇩🏏#BCB | #Cricket | #CWC23 pic.twitter.com/dVy9s4FijA
— Bangladesh Cricket (@BCBtigers) September 26, 2023
వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హాసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, మెహిదీ హసన్ మీరజ్, తౌహిద్ హ్రిదోయ్,తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, హాసన్ మహ్మూద్, నసుమ్ అహ్మద్, మెహిదీ హాసన్, తంజిమ్ షకీబ్, తంజిద్ తమీమ్, మహ్మదుల్లా రియాద్
వరల్డ్ కప్ బంగ్లాదేశ్ షెడ్యూల్:
అక్టోబర్ 5 నుంచి జరిగే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఇంగ్లాండ్‌తో బంగ్లాదేశ్ జట్టు తలపడుతుంది. ఆ తర్వాత అంటే అక్టోబర్ 7న ఆఫ్గాన్‌తో జరిగే మ్యాచ్ ద్వారా బంగ్లా జట్టు తన వరల్డ్ కప్ కాంపెయిన్‌ని ప్రారంభిస్తుంది.
- సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ vs శ్రీలంక (వార్మప్ మ్యాచ్)
- అక్టోబర్ 2: బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్ (వార్మప్ మ్యాచ్)
- అక్టోబర్ 7: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్
- అక్టోబర్ 10: బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్
- అక్టోబర్ 14: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్
- అక్టోబర్ 19: బంగ్లాదేశ్ vs భారత్
- అక్టోబర్ 24: బంగ్లాదేశ్ vs దక్షిణాఫ్రికా
- అక్టోబర్ 28: బంగ్లాదేశ్ vs నెదర్లాండ్స్
- నవంబర్ 31: బంగ్లాదేశ్ vs పాకిస్తాన్
- నవంబర్ 6: బంగ్లాదేశ్ vs శ్రీలంక
- నవంబర్ 9: బంగ్లాదేశ్ vs ఆస్ట్రేలియా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
