AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 13 ఫోర్లు, 20 సిక్సర్లు.. సెంచరీలతో కోహ్లీ శిష్యుల ఊచకోత.. ఓపెనర్లుగా వచ్చి వికెట్ పడకుండా ఉతికేశారు

Anuj Rawat century: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా 20వ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. ఇందులో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ పురాణీ ఢిల్లీని 26 పరుగుల తేడాతో ఓడించి ఆరో విజయాన్ని నమోదు చేసింది. ముందుగా ఆడిన ఈస్ట్ ఢిల్లీ నుంచి అద్భుత ప్రదర్శన చేయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 241 పరుగుల భారీ స్కోరు చేసింది.

Video: 13 ఫోర్లు, 20 సిక్సర్లు.. సెంచరీలతో కోహ్లీ శిష్యుల ఊచకోత.. ఓపెనర్లుగా వచ్చి వికెట్ పడకుండా ఉతికేశారు
Anuj Rawat And Simarjit Sin
Venkata Chari
|

Updated on: Aug 30, 2024 | 8:55 AM

Share

Anuj Rawat century: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా 20వ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. ఇందులో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ పురాణీ ఢిల్లీని 26 పరుగుల తేడాతో ఓడించి ఆరో విజయాన్ని నమోదు చేసింది. ముందుగా ఆడిన ఈస్ట్ ఢిల్లీ నుంచి అద్భుత ప్రదర్శన చేయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 241 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ స్కోర్‌కు ప్రతిస్పందనగా పురాణీ ఢిల్లీ కూడా బలమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ 20 ఓవర్లు ఆడి 215/8 మాత్రమే చేయగలిగింది. ఈస్ట్ ఢిల్లీకి చెందిన ఓపెనర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. అనూజ్ రావత్ బ్యాట్ నుంచి అత్యధిక పరుగులు వచ్చాయి.

ఈస్ట్ ఢిల్లీ ఓపెనర్స్ ఇద్దరూ సెంచరీలు..

పురాణీ ఢిల్లీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇది పూర్తిగా తప్పు అని నిరూపితమైంది. ఈస్ట్ ఢిల్లీ ఓపెనర్లు బౌలర్ల పరిస్థితిని చెడగొట్టారు. అనూజ్‌ రావత్‌ , సిమర్‌జిత్‌ సింగ్‌ జోడీ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించి పరుగుల వర్షం కురిపించారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మొదట సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వారి వారి హాఫ్ సెంచరీలను పూర్తి చేశారు. ఆ తర్వాత జట్టు స్కోరు 150, ఆపై 200 దాటింది. ఈ సమయంలో, ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీలు సాధించారు. అనూజ్ 66 బంతుల్లో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో, అతని భాగస్వామి సిమర్‌జీత్ 57 బంతుల్లో ఏడు ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 108 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ చివరి వరకు నిలకడగా నిలవడంతో ఓల్డ్ ఢిల్లీ నుంచి ఏ బౌలర్ కూడా వికెట్ తీయలేకపోయారు.

ఇవి కూడా చదవండి

పురాణీ ఢిల్లీ చివరి వరకు పోరాడినా..

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పురాణీ ఢిల్లీకి ప్రత్యేకంగా ఆరంభం లేకపోవడంతో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి అర్పిత్ రాణాతో కలిసి వంశ్ బేడీ స్కోరు 100 దాటింది. అర్పిత్ బ్యాట్‌ నుంచి 27 పరుగులు వచ్చాయి. వంశ్ బేడీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా సెంచరీ మిస్సయ్యాడు. అతని బ్యాట్‌ నుంచి 41 బంతుల్లో నాలుగు ఫోర్లు, 11 సిక్సర్లతో 96 పరుగులు వచ్చాయి. అర్నవ్ బగ్గా 13 బంతుల్లో 28 పరుగులు చేశాడు. చివరికి లక్ష్యం చాలా పెద్దదని నిరూపితమైంది. దీంతో పురాణీ ఢిల్లీ జట్టు వెనుకంజలోనే నిలిచింది. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ తరపున హర్ష్ త్యాగి గరిష్టంగా మూడు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..