IND vs BAN Records: 85 ఏళ్లలో మొదటిసారి ఇలా.. కాన్పూర్ టెస్ట్‌లో నమోదైన 10 భారీ రికార్డులు
IND vs BAN: కాన్పూర్ టెస్టులో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం రెండున్నర రోజుల వ్యవధిలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా తొలిరోజు మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చాడు.
IND vs BAN: కాన్పూర్ టెస్టులో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం రెండున్నర రోజుల వ్యవధిలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా తొలిరోజు మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి 52 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఆ తర్వాత, బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసి, భారత్‌కు 95 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆతిథ్య జట్టు మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. మ్యాచ్ చివరి రోజున ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం..
కాన్పూర్ టెస్ట్ మ్యాచ్‌లో నమోదైన 10 భారీ రికార్డులు ఇవే..
1. కాన్పూర్ టెస్టు విజయంతో టీం ఇండియా ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో 180 విజయాలు సాధించింది. అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన నాలుగో జట్టుగా టీమిండియా నిలిచింది.
2. ఐదో రోజు విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, అతను 27 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు కొట్టాడు. కోహ్లి ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో 1000 ఫోర్లు పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు.
3. సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయం. 2013 నుంచి 2024 మధ్యకాలంలో టీమిండియా స్వదేశంలో ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు.
4. కాన్పూర్ టెస్టులో విజయం సాధించేందుకు టీమిండియా రెండు ఇన్నింగ్స్‌లతో కలిపి మొత్తం 312 బంతులు ఎదుర్కొంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ బంతులు ఆడి విజయం సాధించిన నాలుగో జట్టుగా భారత జట్టు నిలిచింది.
5. ఐదో రోజు మ్యాచ్ ముగియగా, రవిచంద్రన్ అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఇప్పుడు అతను టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు (11 సార్లు) మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్న ఉమ్మడి మొదటి ఆటగాడిగా నిలిచాడు.
– Just 35 overs on Day 1. – Day 2 & Day 3 abandoned. – A result with 45 overs left. – Fastest team 50, 100, 150, 200 & 250. – Highest run rate in a Test Innings.
INDIA WIN THE HISTORIC KANPUR TEST AND CONTINUES TO DOMINATE TEST CRICKET…!!! 🇮🇳 pic.twitter.com/IT2g4zkCPI
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2024
6. టీమ్ ఇండియా మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రెండు ఇన్నింగ్స్‌లలో ఒక్క మెయిడిన్ ఓవర్ కూడా ఆడలేదు. దీంతో 85 సంవత్సరాలలో ఇలా మొదటిసారి జరగడం గమనార్హం.
7. రెండు ఇన్నింగ్స్‌లతో కలిపి టీమ్ ఇండియా స్ట్రైక్ రేట్ 7.36గా నిలిచింది. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఈ ఘనత సాధించలేకపోయింది.
8. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువగా ఉంది. ఈ ఘనత సాధించిన చివరి భారత ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ నిలిచాడు.
9. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట రద్దయినా, నాలుగు ఇన్నింగ్స్‌ల్లో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన తొలి జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది.
10. ఈ టెస్ట్ మ్యాచ్‌లో రన్ రేట్ 4.34గా నిలిచింది. టీమ్‌ఇండియా టెస్టుల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక రన్‌రేట్‌గా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..