AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bundesliga Women 2024: ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్‌ కు బిగ్ షాక్.. వెర్డర్ బ్రెమెన్ చేతిలో అనూహ్య ఓటమి

Bundesliga Women 2024, Werder Bremen vs Eintracht Frankfurt: ప్రతిష్ఠాత్మక బుండెస్లిగా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 38 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇక శనివారం (అక్టోబర్ 19) జరిగిన మ్యాచ్ లో ఫేవరెట్ టీమ్ ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్‌ కు అనూహ్య పరాజయం ఎదురైంది.

Bundesliga Women 2024: ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్‌ కు బిగ్ షాక్.. వెర్డర్ బ్రెమెన్ చేతిలో అనూహ్య ఓటమి
Bundesliga Women 2024
Basha Shek
|

Updated on: Oct 20, 2024 | 9:24 PM

Share

Bundesliga Women 2024, Werder Bremen vs Eintracht Frankfurt: జర్మనీ వేదికగా జరుగుతోన్న బుండెస్లిగా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ మ్యాచ్ లు ఉత్కంఠ రేపుతున్నాయి. టోర్నీ ఏడో రోజు 38వ మ్యాచ్ లో భాగంగా శనివారం (అక్టోబర్ 19) ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్, వెర్డర్ బ్రెమెన్ జట్లు తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో వెర్డర్ బ్రెమెన్ 1-0తో ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్‌ను ఓడించింది. తద్వారాఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఫ్రాంక్‌ఫర్ట్ తొలి ఓటమిని నమోదు చేసుకోగా, వెర్డర్ బ్రెమెన్ టోర్నీలో రెండో విజయాన్ని కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో తొలి అర్ధభాగంలో ఇరు జట్లు ఎలాంటి గోల్‌ నమోదు కాలేదు. రెండో అర్ధభాగంలోనూ ఇరు జట్లు గోల్‌ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే మ్యాచ్ 75వ నిమిషంలో వెర్డర్ బ్రెమెన్ మిడ్‌ఫీల్డర్ సోఫీ వీడౌర్ ప్రత్యర్థి జట్టు డిఫెన్స్‌ను ఛేదించి గోల్ చేయడంలో సఫలమైంది. కాకపోతే 95 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు మరే ఇతర గోల్స్ నమోదు చేయలేదు. చివరగా, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న వెర్డర్ బ్రెమెన్, అగ్రస్థానంలో ఉన్న ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్‌ను 1-0తో ఓడించగలిగింది.

టోర్నీలో ఇప్పటివరకు రెండు జట్ల ప్రదర్శన గురించి మాట్లాడితే, ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మిగతా మ్యాచ్‌లు డ్రాగా ముగియడంతో జట్టు ఖాతాలో మొత్తం 16 పాయింట్ల ఉన్నాయి. ఇక వెర్డర్ బ్రెమెన్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌లు ఓడింది. మిగిలిన 2 మ్యాచ్‌లు డ్రాగా ముగియడంతో ఆ జట్టు 8 పాయింట్లు సాధించింది.

ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్‌ వర్సెస్ వెర్డర్ బ్రెమెన్ జట్ల మధ్య మ్యాచ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు
రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..