AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Sign: అందం.. తెలివితేటల్లో ఆ రాశి అమ్మాయిలను మించినవారు ఉండరు.. ఇందులో మీరూ ఉన్నారా..

జ్యోతిష్యం ప్రకారం వ్యక్తి స్వభావం రాశిచక్రంలో దాగి ఉంటుంది. ఒక వ్యక్తి తన వర్తమానం, భవిష్యత్తు కూడా రాశిచక్రం ద్వారా తెలుస్తుంది. ఏ రాశి వారు ఎలా ఉంటారు..? వారి జీవన గమనం ఎలా..

Zodiac Sign: అందం.. తెలివితేటల్లో ఆ రాశి అమ్మాయిలను మించినవారు ఉండరు.. ఇందులో మీరూ ఉన్నారా..
Zodiac Sign
Sanjay Kasula
|

Updated on: Jan 21, 2022 | 9:18 AM

Share

Zodiac Sign: జ్యోతిష్యం ప్రకారం వ్యక్తి స్వభావం రాశిచక్రంలో దాగి ఉంటుంది. ఒక వ్యక్తి తన వర్తమానం, భవిష్యత్తు కూడా రాశిచక్రం ద్వారా తెలుస్తుంది. ఏ రాశి వారు ఎలా ఉంటారు..? వారి జీవన గమనం ఎలా ఉంటుంది..? వారిలో ఏ స్థాయిలో ప్రతిభ ఉంటుంది..? నడక.. నడవడి అన్ని రాశి చక్రం చెబుతుంది. అయితే ఈ నాలుగు రాశుల అమ్మాయిలు తెలివితేటల పరంగా ఇతరులకు భిన్నంగా ఉంటారు. అలాంటి అమ్మాయిలు తమ ప్రతిభతో గౌరవం, విజయం పొందుతారు. ఈ రాశుల గురించి తెలుసుకుందాం.

మిథునరాశి(జెమిని): మిథునరాశి అమ్మాయిలు తప్పుపట్టలేనివారు. ప్రతి పనిని చక్కగా చేయాలని ప్లాన్ చేస్తారు. వారి హాస్యం చాలా బాగుంటుంది. వారిని మాటల్లో కొట్టడం చాలా కష్టం. వీరికి చదువు ప్రాముఖ్యత తెలుసు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బుధుడు ఈ రాశికి అధిపతి. జ్యోతిషశాస్త్రంలో మెర్క్యురీ గ్రహాన్ని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. మెర్క్యురీ ప్రభావం వల్ల ఈ రాశి అమ్మాయిలు ప్రసంగం, గణితం, వాణిజ్యం, చట్టం, కమ్యూనికేషన్ మొదలైన రంగాలు ఎంచుకుంటే ఉన్నత స్థానంలో ఉంటారు. బుధ గ్రహం శుభప్రదంగా ఉండటం వల్ల  అమ్మాయిలు ఈ రంగాలలో విశేష విజయాన్ని పొందుతారు. వాదనలలో వారిని ఎవరూ ఓడించలేరు.  వీరు ప్రతి పనిని కొత్త పద్ధతిలో చేయడానికి ఇష్టపడతారు. గణేశుడిని పూజించడం వల్ల బుధ గ్రహం రాశి వారికి ఐశ్వర్యం పెరుగుతుంది. ‘a’, ‘ch’,’d’లతో ఈ రాశి అమ్మాయిల పేర్లు మొదలవుతాయి.

సింహరాశి (లియో): జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. సింహరాశిని ఐదవ రాశిగా పరిగణిస్తారు. సూర్యుడు సింహ రాశికి అధిపతిగా పరిగణించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఇది అన్ని కొత్త గ్రహాలకు రాజుగా వర్ణించబడింది. సూర్యుడు ఆధిపత్యం వహించినందున సింహరాశి వారు తమ స్వభావం రాజులా ఉంటుంది. సింహ రాశి ఉన్న అమ్మాయిలు ఇతరుల ఆదేశాలను పాటించడానికి ఇష్టపడరు. దీని వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశిచక్రం వ్యక్తిత్వం చాలా ఆకట్టుకుంటుంది. వారు ఇతరులను ఆకర్షిస్తారు. సింహ రాశి ఉన్న అమ్మాయిలకు నాయకత్వం వహించే అద్భుతమైన సామర్థ్యం కలిగివుంటారు. సింహరాశి జాతకంలో సూర్యుని స్థానం బలంగా ఉన్నప్పుడు వారికి వారి తండ్రి మద్దతు లభిస్తుంది. వారు జీవితంలో గొప్ప పనులు చేస్తారు. వారు ప్రమాదాలకు భయపడరు. వారు జీవితంలో తమ లక్ష్యాల సాధించేవరకు పని చేస్తుంటారు. Ma, Mi, Moo, Me, Mo, Ta, Tee, Tu, Tay, తో ఈ రాశి వారి పేర్లు మొదలవుతాయి.

వృశ్చికం (స్కార్పియో): జ్యోతిషశాస్త్రంలో వృశ్చిక రాశిచక్రం ముఖ్యమైన చిహ్నంగా పరిగణించబడుతుంది. రాశిచక్రం ప్రకారం, ఈ రాశి ఎనిమిదవ స్థానంలో ఉంటుంది. కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. తొమ్మిది గ్రహాలలో అంగారక గ్రహానికి అధిపతిగా పరిగణించబడుతుంది. ఈ రాశిచక్రం ఉన్న అమ్మాయిలు వారు ప్రణాళిక, పనిని ఎక్కువగా నమ్ముతారు. ఇతరులు తమ ప్రణాళికల గురించి తెలుసుకోవడం చాలా కష్టం. వారి మనసులో ఏముందో కనుక్కోవడం కూడా కష్టం. వీరు విలువలు గౌరవం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడరు. ప్రతి సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలుగుతారు. To, Na, Ni, Nu, Ne, No, Ya, Yi, Yu అనే ఈ అక్షరాలతో వీరి పేరు మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి: TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు..

Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్‌ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..