AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: కొన్ని సందర్భాల్లో అసంతృప్తి కూడా మేలే చేస్తుంది.. చాణక్య చెప్పిన కీలక విషయాలు మీకోసం..

Chanakya Niti: జీవితంలో ప్రతి పరిస్థితిని స్వీకరించి సంతృప్తి చెందాలని, తాను సాధించాలనుకున్న

Chanakya Niti: కొన్ని సందర్భాల్లో అసంతృప్తి కూడా మేలే చేస్తుంది.. చాణక్య చెప్పిన కీలక విషయాలు మీకోసం..
Acharya Chanakya
Shiva Prajapati
|

Updated on: Jan 21, 2022 | 8:03 AM

Share

Chanakya Niti: జీవితంలో ప్రతి పరిస్థితిని స్వీకరించి సంతృప్తి చెందాలని, తాను సాధించాలనుకున్న దాని కోసం నిరంతరం శ్రమించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే, ఆచార్య చాణక్యుడు మాత్రం సంతృప్తి, అసంతృప్తి రెండూ మనిషికి మేలు చేసేవే అంటారు. ఆ క్రమంలోనే ఆ రెండింటి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా తాను రాసిన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులను ప్రస్తావించిన చాణక్య.. సంతృప్తి, అసంతృప్తి రెండూ జీవితంలో ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయని, వాటిని అర్థం చేసుకోవడం మాత్రమే అవసరం అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మనిషికి అసంతృప్తి చాలా ముఖ్యమైనదని చెప్పారు. కారణం, ఆ అసంతృప్తి అతనిని జీవితంలో ముందుకు తీసుకెళ్లడానికి, అతనికి మంచి చేయడానికి ఉపకరిస్తుందంటారు. మరి ఏ పరిస్థితుల్లో సంతృప్తి, అసంతృప్తితో ఉండాలి? ఆచార్య చాణక్య ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పరిస్థితుల్లో సంతృప్తిగా ఉండాలి.. 1. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. భార్య అందంగా లేకపోయినా వ్యక్తి సంతృప్తిగా ఉండాలి. పర స్త్రీ పట్ల ఆకర్షితులవకూడదు. లేదంటే వ్యక్తి తనకు తానుగా కష్టాలను ఆహ్వానించినట్లవుతుంది. 2. ఏ ఆహారం దొరికినా అందులో తృప్తి చెంది ఆనందంగా తీసుకోవాలి. ఎప్పుడూ తినే పదార్థాలను చెడుగా భావించొద్దు. ప్లేట్‌లో ఆహారాన్ని వదిలేయొద్దు. భగవంతుడు మీకు కావలసినంత ఆహారం ఇచ్చినందుకు సంతృప్తి చెంది సంతోషంగా ఉండాలి. 3. వ్యక్తి తన ఆదాయం విషయంలో సంతృప్తి చెందడం ద్వారా సంతోషంగా ఉండాలి. మీ ఇంటి ఖర్చులు, ఆదాయాన్ని బట్టి చూసుకుని ముందుకు సాగేందుకు కృషి చేయాలి. కానీ ఎప్పుడూ దురాశతో, ఇతరుల సంపద వైపు చూడకూడదు.

ఈ పరిస్థితుల్లో అసంతృప్తిగా ఉండాలి.. 1. విద్య, జ్ఞానం విషయంలో వ్యక్తి సంతృప్తి చెందకుండా ఉండాలి. మీరు ఎంత అసంతృప్తితో ఉంటే.. అంత సామర్థ్యం, యోగ్యత కలిగి ఉంటారు. విద్య, జ్ఞానం మీకు గౌరవాన్ని, సంపదను తెచ్చిపెడతాయి. 2. దానం విషయంలో వ్యక్తి అసంతృప్తిగా ఉండాలి. దానధర్మం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది. మన జీవితం మెరుగుపడుతుంది. అందుకే ఎంత దానం చేసినా అసంతృప్తితోనే ఉండాలంటారు ఆచార్య చాణక్యుడు. 3. భగవంతుని మంత్రాన్ని ఎంత ఎక్కువగా జపిస్తే అంత ఎక్కువగా మీకు మేలు జరుగుతుంది. అందువల్ల, మంత్రాన్ని జపించడంలో ఎప్పుడూ సంతృప్తి చెందకండి.

Also read:

TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు..

Coronavirus: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడిని బలి తీసుకున్న కరోనా….

Ghana Blast: బంగారు గని కోసం పేలుడు పదార్ధాలను తీసుకెళ్తున్న ట్రక్.. మోటార్ సైకిల్ ఢీ.. భారీ పేలుడు 17 మంది మృతి..