AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడిని బలి తీసుకున్న కరోనా….

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది.  కరోనా బారిన పడిన ప్రముఖ దర్శకుడు ప్రదీప్‌ రాజ్‌ కన్నుమూశారు

Coronavirus: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం..  ప్రముఖ దర్శకుడిని బలి తీసుకున్న కరోనా....
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 21, 2022 | 7:00 AM

Share

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది.  కరోనా బారిన పడిన ప్రముఖ దర్శకుడు ప్రదీప్‌ రాజ్‌ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం  ఆయనకు కరోనా పాజిటివ్ అని  నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు  బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే ఆయన  చికిత్స పొందుతున్నారు.  కాగా గురువారం చికిత్స తీసుకుంటూనే ప్రదీప్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు  తెలిపారు. కొవిడ్ కు తోడు గత 15 ఏళ్లుగా  ఆయన మధుమేహంతో బాధపడుతున్నారని, దీంతో  ఆరోగ్యం బాగా క్షీణించిందన్నారు.  చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని  పేర్కొన్నారు. ఆయనకు 46 సంవత్సరాలు కాగా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాండిచ్చేరిలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇకపోతే ప్రదీప్ రాజ్ కన్నడలో ప్రముఖ దర్శకుడిగా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ హీరో యష్ తో కలిసి ‘కిచ్చా’, ‘కిరాతక’ అనే సూపర్ హిట్ సినిమాలను తెరక్కించారు. ఈ చిత్రాలు యష్ కి  స్టార్ హీరో స్టేటస్ తెచ్చిపెట్టాయి.  అదేవిధంగా  గోల్డెన్ స్టార్  మిస్టర్, రజనీకాంత, సతీష్ నీనాసం, అంజాద్ మాలే సినిమాలను కూడా ప్రదీప్ తెరకెక్కించారు. కాగా కరోనా రాకముందు యష్ తో కలిసి కిరాతక 2 తెరకెక్కించడానికి  ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రదీప్ ప్రకటించారు. అయితే ఆ కల నెరవేరకుండానే ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా డైరెక్టర్ మృతి పట్ల పలువరు ప్రముఖులు, సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి మనోధైర్యం అందించాలని ప్రార్థిస్తున్నారు.

Also Read: Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..

TV9 Digital TOP 9 NEWS : 5జీ దెబ్బకు నిలిచిన విమానాలు.. వ్యాక్సిన్‌ వద్దంటూ చెట్టెక్కిన యువకుడు.!(వీడియో)

TV9 Digital News Round Up : అప్సరరాణి నోట క్యాస్టింగ్‌కౌచ్‌ మాట | కోళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు..( వీడియో)