Vinayaka Chavithi: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్ర వినాయకుడు.. ఆ ఒక్కరోజు మాత్రమే దర్శనం
డైమండ్ సిటీలో కొలువీరిన డైమండ్ గణపతిని భక్తులు దర్శనం చేసుకోవాలంటే ముందస్తుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఈ గణేశ విగ్రహం ఎక్కడ ఉందనేది కూడా అత్యంత రహస్యంగానే ఉంది ఎందుకంటే ఇది గణేశుడి ఆకారంలో ఉన్న సహజసిద్ధమైన వజ్రం. దీని విలువ కోట్లలో ఉంటుంది
Vinayaka Chavithi: దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందడి నెలకొంది. ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా వాడవాడలా రకరకాల రూపాల్లో వినాయక ప్రతిమలు మండపాల్లో కొలువుదీరాయి. పూజలను అందుకుంటున్నాయి. అయితే ఈరోజు ఒక అరుదైన.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గణపతి గురించి తెలుసుకుందాం.. కోట్లు విలువజేసే ఈ సహజ వినాయక విగ్రహం డైమండ్ సిటీగా ఖ్యాతిగాంచిన సూరత్ లో ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ బట్టల వ్యాపారానికే కాదు.. వజ్రాల వ్యాపారానికి ఖ్యాతిగాంచింది. డైమండ్ సిటీగా ఖ్యాతిగాంచిన ఈ నగరం వజ్రాల పాలిషింగ్, వ్యాపారంలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అటువంటి ఈ డైమండ్ సిటీలో కొలువీరిన డైమండ్ గణపతిని భక్తులు దర్శనం చేసుకోవాలంటే ముందస్తుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఈ గణేశ విగ్రహం ఎక్కడ ఉందనేది కూడా అత్యంత రహస్యంగానే ఉంది ఎందుకంటే ఇది గణేశుడి ఆకారంలో ఉన్న సహజసిద్ధమైన వజ్రం. దీని విలువ కోట్లలో ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే..
సూరత్‌లోని మహీదర్‌పురాకు చెందిన కరమ్ గ్రూప్ చైర్మన్ వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఈ వజ్ర వినాయకుడి బెల్జియం నుంచి తీసుకుని వచ్చారు. 182.53 క్యారెట్ల వజ్రంలో గణేశుని రూపం స్పష్టంగా కనిపిస్తుంది. బెల్జియం వజ్రాల గనిలో నుండి బయటకు వచ్చిన ఈ వజ్రంలో గణేష్ తొండం, చేతులు, కళ్ళు, కాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. 82.53 క్యారెట్ రఫ్ డైమండ్ ఆఫ్రికాలో గనుల నుంచి బయల్పడింది. పసుపు బూడిద రంగు వజ్రం దాదాపు 48 mm ఎత్తు, 32 mm వెడల్పు , 20mm మందంతో ఉంటుంది. దీని బరువు 36.50 గ్రాములు. డైమండ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వజ్రం విలువ సుమారు రూ. 600 కోట్లు ఉండవచ్చని అంచనా. కనుక ఈ వజ్ర వినాయకుడి దర్శనం కోరుకునే భక్తులు కానూభాయ్ కార్యాలయానికి కాల్ చేయాలి. అప్పుడు దర్శనం చేసుకునే టైం స్లాట్ ఇస్తారు. దానికి అగుణంగా వెళ్లి.. బొజ్జ గణపయ్యని దర్శించుకోవచ్చు.
కనుభాయ్ ఈ గణపతి గురించి మాట్లాడుతూ.. ఈ గణేశుడు స్వయంగా వజ్రాల రూపంలో మనపై కురిపించిన అమూల్యమైన ఆశీర్వాదం అని అంటారు. అందుకే ఈ వజ్రంను అమ్మకానికి పెట్టడం లేదని చెప్పారు. ఈ వినాయకుడికి తన ఇంట్లో ప్రత్యేక పూజిలు నిర్వహిస్తున్నారు. ఏడాది ఒకసారి గణేశ పూజ రోజుల్లో మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క సహజ వజ్రం వినాయకుడు ఉన్నాడు. నేను దానిని సంవత్సరం పొడవునా ఒక తెలియని ప్రదేశంలో సురక్షితమైన ఖజానాలో ఉంచుతాను. కనుభాయ్ 12 సంవత్సరాల క్రితం కఠినమైన వజ్రాల కొనుగోలు కోసం యాంట్‌వెర్ప్‌కు వెళ్లినప్పుడు ఈ వజ్రాన్ని కనుగొన్నారు. ఈ గణపతిని భక్తుల దర్శనం కోసం సిద్ధివినాయక్ ఆలయానికి కూడా తీసుకొస్తామని వెల్లడించారు ఆ వ్యాపారి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి