Vinayaka Chavithi: వినాయక చవితి సందర్భంగా మీ ప్రియమైనవారికి శుభకాంక్షలు తెలియజేయండి ఇలా..

ప్రతి కొత్త పని ప్రారంభంలో , పూజ సమయంలో, ముందుగా వినాయకుడిని పూజిస్తారు. గణేష్ చతుర్థి సందర్భంగా మీరు మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేయాలనుకుంటున్నారా.. మీకోసం కొన్ని ఐడియాలు.. 

Vinayaka Chavithi: వినాయక చవితి సందర్భంగా మీ ప్రియమైనవారికి శుభకాంక్షలు తెలియజేయండి ఇలా..
Ganesh Chaturdhi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:24 PM

Vinayaka Chavithi: దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు ఈ పండగను జరుపుకోనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజలు గణేశుని ఆశీస్సుల కోసం పూజలు చేస్తారు. గణేశ చతుర్థిని గణేశుడి జన్మదినంగా భావిస్తారు. శివ పార్వతుల తనయుడు గణపతి.  హింద సనాతన ధర్మంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గణేశుడు అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. ప్రతి కొత్త పని ప్రారంభంలో , పూజ సమయంలో, ముందుగా వినాయకుడిని పూజిస్తారు. గణేష్ చతుర్థి సందర్భంగా మీరు మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేయాలనుకుంటున్నారా.. మీకోసం కొన్ని ఐడియాలు..

వినాయక చవితి శుభాకాంక్షలు 

ఆనందాన్ని కలిగించి.. దుఃఖాన్ని తొలగించే .. బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చే మంగళ మూర్తి గణపతి. వినాయక చవితి శుభాకాంక్షలు. 

ఇవి కూడా చదవండి

మీ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు…

బుద్ధి సిద్ధిని ఇచ్చేవాడు, దుఃఖాన్ని నివారించి సంతోషాన్ని కలిగించే గణేష్ మహారాజ్ కి జై.. వినాయక చవితి శుభాకాంక్షలు…

మీరు కోరుకున్న అన్ని పనులు ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఆ వినాయకుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యుల పై ఎల్లవేళలా ఉండాలి అని, మీరు మీ కుటుంభ సభ్యులు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు

సర్వ విఘ్నాలను అధిగమించి, జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో మీరు అన్ని రంగాలలోను ముందుండాలని, సంపూర్ణ ఆరోగ్యములతో జీవించాలని కోరుతూ మీకు మీ కుటుంబ సభ్యులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు

మీరు కోరుకున్న అన్ని పనులు ఏ విధమైన ఆటంకాలు లేకుండా .. ఆ వినాయకుడి ఆశీస్సులు మీపై మీ కుటుంబ సభ్యుల పై ఎల్లవేళలా ఉండాలి అని, మీరు, మీ కుటుంభ సభ్యులు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. 

మీరు చేసే ప్రతి కార్యంలోనూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విజయం చేకూరాలని వినాయక చవితి పండుగను మీ బంధు మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు…

మీరు చేపట్టే ప్రతీకార్యం నిర్విఘ్నంగా జరగాలని ఆ గణనాధుని ప్రార్థిస్తూ మీకు  వినాయక చవితి శుభాకాంక్షలు.

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవిస్తూ. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ స్నేహితులకు వినాయక చవితి శుభాకాంక్షలు