Vinayaka Chavithi: తన పాదాలను తాకిన భక్తులను ఆశీర్వదిస్తున్న గణపయ్య.. ఓ ఆర్టిస్ట్ విభిన్న సృష్టి ఈ వినాయక ప్రతిమ

ఈ ఏడాది వినాయక చవితికి ఓ స్పెషల్ వినాయకుడు మండపానికి విచ్చేశాడు. తన పాదాలను తాకిన భక్తుడిని గణపయ్య ఆశీర్వదించనున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Vinayaka Chavithi: తన పాదాలను తాకిన భక్తులను ఆశీర్వదిస్తున్న గణపయ్య.. ఓ ఆర్టిస్ట్ విభిన్న సృష్టి ఈ వినాయక ప్రతిమ
Vinayaka Chavithi
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:25 PM

Vinayaka Chavithi: దేశ వ్యాప్తంగా వినాయక చవితి శోభ వెల్లువిరుస్తోంది. దేశ వ్యాప్తంగా గల్లీ గల్లీలోనూ వినాయక మండపాలు వెలిశాయి. వివిధ రూపాల్లో గణపతి విగ్రహాలు ప్రతిష్టించారు. బొజ్జ గణపయ్యను పూజించనున్నారు. అయితే ఈ ఏడాది వినాయక చవితికి ఓ స్పెషల్ వినాయకుడు మండపానికి విచ్చేశాడు. తన పాదాలను తాకిన భక్తుడిని గణపయ్య ఆశీర్వదించనున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఓ ఆర్టిస్ట్ విభిన్నంగా ఆలోచించి సరికొత్త గణపతిని తయారు చేశారు. ఈ గణపతిని భక్తితో మొక్కి.. పాదాలను తాకితే.. అపుడు గణపతి ప్రతిమ తన భక్తులను లేచి నిలబడి ఆశీర్వదిస్తుంది. చెయ్యి ఎత్తి దీవిస్తుంది. అనంతరం మళ్ళీ ఆ వినాయక విగ్రహం.. యధాస్థానంలో తన పీఠంపై కూర్చుతుంది. ప్రస్తుతం ఈ విలక్షణమైన వినాయక విగ్రహం వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..