AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: అదృష్టం పొందాలంటే.. ఈ వస్తువులను వెంటనే మీ పర్సు నుంచి తీసేయండి.!

పురుషులు, మహిళలు డబ్బులతో పాటు పలు పేపర్స్‌ను తమ పర్సులో పెట్టుకుంటారు. ఇక అందులో అవసరం లేనివి కూడా ఉండొచ్చు. అయితే వాస్తు శాస్త్రం..

Vastu Tips: అదృష్టం పొందాలంటే.. ఈ వస్తువులను వెంటనే మీ పర్సు నుంచి తీసేయండి.!
Purse
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 08, 2021 | 8:42 PM

Share

పురుషులు, మహిళలు డబ్బులతో పాటు పలు పేపర్స్‌ను తమ పర్సులో పెట్టుకుంటారు. ఇక అందులో అవసరం లేనివి కూడా ఉండొచ్చు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు మీ పర్సులో ఉంటే.. దరిద్రం మీ వెంటే ఉంటుందట. ఆ వస్తువుల వల్ల డబ్బు లోటు ఏర్పడుతుందని.. మీరు కావాల్సిన డబ్బును ఆదా చేయలేరని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఏయే వస్తువులు పర్సులో ఉంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది డబ్బు లావాదేవీలకు సంబంధించిన బిల్లులను తమ పర్సులో ఉంచుకుంటారు. అలాంటి బిల్స్ ఎక్కువసేపు పర్స్‌లో ఉంచుకుంటే.. వాస్తు దోషం ఉండొచ్చు. మీకు డబ్బు నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దేవుళ్ల ఫోటోలు, చనిపోయిన బంధువుల చిత్రాలు పర్సులో పెట్టుకోవద్దు. అలాంటివి పెట్టుకోవడం ద్వారా మీకు ఆర్ధిక సమస్యలు తలెత్తవచ్చు లేదా అప్పులు పెరగొచ్చు. మీ వాలెట్ డబ్బును భద్రపరిచేది మాత్రమే కాదు.. లక్ష్మీదేవి ఉండే చోటు కూడా.. అందుకే అది ఎలప్పుడూ శుభ్రంగా ఉండాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం చిటికెడు బియ్యం పర్సులో ఉంచడం వల్ల మీ డబ్బు ఆదా అవుతుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. డబ్బును ఎప్పుడూ పర్సులో మడిచిపెట్టకండి. అలాగే మురికి చేతులతో పర్సును తాకకూడదు. బ్లేడ్లు, చిన్న కత్తులు వంటి పదునైన వస్తువులను కూడా పర్సులో పెట్టుకోవద్దు. ఇవే కాకుండా, నోట్లు, నాణేలను ఎప్పుడూ పర్స్‌లో ఒకే చోట ఉంచకూడదు. నాణేలను పర్సులో ఉన్న ప్రత్యేక జిప్‌ అరలో ఉంచండి. మరోవైపు మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు లాంటివి పర్సులో ఉంచకూడదు. అవి పెట్టడం వల్ల లక్ష్మీదేవి దరికి రాదు. అవి ఉంటే మీరు అత్యంత హీనమైన పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్టికల్ ప్రచురితమైంది. దీనితో టీవీ9కి, టీవీ9 వెబ్‌సైట్‌కి ఎలాంటి సంబంధం లేదు)

Also Read: Samantha: సమంత-ప్రీతమ్‌‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..

Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!

ఎర కోసం సింహం, మొసలి మధ్య కొట్లాట.. చివరికి గెలిచిందెవరంటే.?

మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. ట్రోలింగ్‌కు స్ట్రాంగ్ రిప్లై.. నెట్టింట వైరల్.!

మెరుగైన ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోండి..