Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమల యాత్రకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. షరతులతో..

Sabarimala Ayyappa Temple: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కేరళలోనే సగానికిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే..

Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమల యాత్రకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. షరతులతో..
Ayyappa Temple
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 08, 2021 | 9:52 AM

Sabarimala Ayyappa Temple: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కేరళలోనే సగానికిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఆ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు, మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలోనే కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కోవిడ్ -19 నిబంధనల ప్రకారం భక్తులను అనుమంతిచనున్నట్లు వెల్లడించింది. మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని శబరిమలలోని అయ్యప్ప కొండను సందర్శించే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నవంబరు 16వతేదీ నుంచి శబరిమలలో తీర్థయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోజుకు 25వేల మంది భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పి. విజయన్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారు లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ నివేదిక ఉన్న భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. అయితే అయ్యప్పస్వామి దర్శనం తర్వాత భక్తులు సన్నిధానంలో ఉండటానికి అనుమతి లేదని వెంటనే పయనం కావాల్సి ఉంటుందని తెలిపారు. మార్గదర్శకాలను భక్తులందరూ పాటించాలని సూచించారు.

అయితే.. అయ్యప్ప అభిషేకం అనతరం భక్తులకు నెయ్యి ఇచ్చే ఏర్పాట్లు చేయాలని దేవస్థానం బోర్డును కేరళ ప్రభుత్వం ఆదేశించింది. గతేడాది లాగానే యాత్రికులను ఎరుమేలి మీదుగా అటవీమార్గంలో, పుల్మేడు మీదుగా సన్నిధానానికి అనుమతించకూడదని సూచించింది. నీలక్కల్ వరకు మాత్రేమ భక్తుల వాహనాలను అనుమతిస్తారు. స్నానానికి పంపానదికి వెళ్లేందుకు భక్తులు కేఎస్సార్టీసీ బస్సులను ఉపయోగించాల్సి ఉంటుంది. శబరిమల తీర్థయాత్ర సందర్భంగా.. సీఎం విజయన్ గురువారం.. దేవస్థానం, రవాణ, అటవీ, ఆరోగ్య, నీటివనరుల శాఖ మంత్రులు, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కరోనా పరీక్షల తర్వాతే తీర్థయాత్రకు రావాలని సీఎం పినరయి విజయన్ సూచించారు. దేవస్థానం భవనాల్లో స్మోక్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా.. కేరళలో గురువారం ఒక్కరోజే 12,288 కరోనా కేసులు నమోదు చేయగా.. 141 మంది మరణించారు.

Also Read:

Garuda Puranam: ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే దరిద్రానికి, దురదృష్టానికి ఆహ్వానం పలికినట్లే.!

చాణక్య నీతి: విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన 4 మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..