Viral Video: ఎర కోసం సింహం, మొసలి మధ్య కొట్లాట.. చివరికి గెలిచిందెవరంటే.?

Viral Video: అడవికి రారాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు గర్జన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు అడ్డం పట్టేలా...

Viral Video: ఎర కోసం సింహం, మొసలి మధ్య కొట్లాట.. చివరికి గెలిచిందెవరంటే.?
Lion
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 08, 2021 | 8:40 PM

అడవికి రారాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు గర్జన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు అడ్డం పట్టేలా పలు వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. సింగిల్‌గా తన వేటను కొనసాగించే సింహాన్ని.. మరో జంతువు ఢీకొంటే.. అప్పుడెలా ఉంటుంది. వినడానికి ఆ ఊహ ఎంతో బాగుంది కదా.! సింహానికి సమవుజ్జీగా నిలిచే జంతువు ఉంటే.. పోరు భీకరంగా ఉంటుంది. ఇక ఈ వీడియో చూస్తే మీకు అదే అనిపిస్తుంది.

సింహంతో మొసలి తలబడటం మీరెప్పుడైనా చూశారా.? రెండూ క్రూర జంతువులు.. వీటితో ఏ జంతువు తలబడినా.. ప్రాణాలు పోవాల్సిందే. అలాంటిది ఈ రెండు జంతువులు ఓ ఎర కోసం కొట్లాట పెట్టుకున్నాయి. బాహుబలి, భల్లాలదేవ మాదిరిగా చిన్న సైజ్ యుద్దాన్ని చేశాయి. మరి ఈ పోరులో ఎవరు గెలిచారో చూసేయ్యండి..

నది ఒడ్డున ఓ జింక కళేబరాన్ని మొసలి తన పదునైన దవడలతో పట్టుకుని ఉంటుంది. ఎక్కడ నుంచి చూసిందో గానీ ఓ సింహం దాన్ని చూసి లాక్కుకోవడానికి అక్కడికి చేరుకుంటుంది. ఇంకేముంది ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఎర నాదంటే.. నాది అంటూ.. రెండు జంతువులూ వారి బలాబలాలను ప్రదర్శించాయి. అయితే సింహం మాత్రం మొసలి నోట్లో ఉన్న ఎరను పూర్తిగా లాక్కుకోలేకపోయింది. చివరికి ఇద్దరికీ ఆ ఎర రెండు సగాలుగా దక్కింది. దీనికి సంబంధించిన వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలను చూసిన నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి..

Read Also: మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. ట్రోలింగ్‌కు స్ట్రాంగ్ రిప్లై.. నెట్టింట వైరల్.!

మెరుగైన ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోండి..

అదృష్టం పొందాలంటే.. ఈ వస్తువులను వెంటనే మీ పర్సు నుంచి తీసేయండి.!

10 ఓవర్లలో 32 పరుగులు.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు.. ప్రపంచకప్ అందించాడు.. ఈ ఆటగాడు ఎవరంటే.!