10 ఓవర్లలో 32 పరుగులు.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు.. ప్రపంచకప్ అందించాడు.. ఈ ఆటగాడు ఎవరంటే.!
టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సూట్ అయ్యే జట్టు ఏదైనా ఉందంటే.. అది వెస్టిండిస్ టీమ్. టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టు ఇది..
టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సూట్ అయ్యే జట్టు ఏదైనా ఉందంటే.. అది వెస్టిండిస్ టీమ్. టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టు ఇది. 2012 సంవత్సరంలో, మొదటిసారిగా ఈ టీం టైటిల్ గెలుచుకుంది. ఆ సమయంలో ఓ ఆటగాడు అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. అతడెవరో కాదు వివాదాస్పద ఆటగాడు మార్లన్ శామ్యూల్స్. వెస్టిండిస్ జట్టు తొలిసారిగా టీ20 ట్రోఫీ కైవసం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
2012లో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను శ్రీలంకలో నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగింది. ఇందులో వెస్టిండీస్ ఘన విజయం సాధించి.. తొలిసారిగా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. 1979 తర్వాత వెస్టిండీస్ జట్టు ఐసీసీ నిర్వహించిన ప్రధాన ట్రోఫీని గెలుచుకోవడంలో ఇదే మొదటిసారి. ఫైనల్ మ్యాచ్‌లో, మార్లన్ శామ్యూల్స్ బ్యాట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్‌కు చేరుకుంది.
ఫైనల్‌లో శామ్యూల్స్ తుఫాన్ ఇన్నింగ్స్…
ఈ టోర్నమెంట్ చివరి మ్యాచ్ 2012వ సంవత్సరం, అక్టోబర్ 7న జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు మార్లన్ శామ్యూల్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే జట్టుకు 137 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. శామ్యూల్స్ తన ఇన్నింగ్స్‌లో 56 బంతులు ఎదుర్కుని 78 పరుగులు చేశాడు. ఇందులో ఆరు భారీ సిక్సర్లు బాదాడు. ఇక ఈ టార్గెట్‌ను చేధించే క్రమంలో శ్రీలంక జట్టు తలబడింది. 101 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ అయింది. ఫైనల్ మ్యాచ్‌లో శామ్యూల్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
మార్లాన్ శామ్యూల్స్ కెరీర్..
దీని తర్వాత, 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై శామ్యూల్స్ 66 బంతుల్లో అజేయంగా 85 పరుగులు చేసి వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ రెండోసారి దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన శామ్యూల్స్, వెస్టిండీస్ తరపున 71 టెస్టుల్లో 3917 పరుగులు చేశాడు, ఇందులో 7 సెంచరీలు, డబుల్ సెంచరీలు ఉన్నాయి. అలాగే శామ్యూల్స్ 207 వన్డేల్లో 32.98 సగటుతో 5606 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు సాధించాడు. అటు 67 టీ20 మ్యాచ్‌ల్లో శామ్యూల్స్ 1611 పరుగులు చేశాడు.
Also Read: Samantha: సమంత-ప్రీతమ్‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..
Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!
మెరుగైన ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోండి..
అదృష్టం పొందాలంటే.. ఈ వస్తువులను వెంటనే మీ పర్సు నుంచి తీసేయండి.!