AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతిలో డబ్బు నిలవడంలేదా.. సంపదను అడ్డుకునే మీ ఇంట్లోని వాస్తు దోషాలే ఇవే.. వెంటనే ఇలా చేస్తే..

మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలబడటం లేదా..? అవకాశాలు చేజారిపోతున్నాయా? దీనికి వాస్తు దోషాలే కారణం కావచ్చు. శక్తి ప్రవాహం సరిగా లేకపోవడం ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. సంపద ప్రవాహాన్ని అడ్డుకునే సాధారణ వాస్తు దోషాలు, లీకేజీలు, అస్తవ్యస్తత, దిశల ప్రాముఖ్యత వంటి వాటి గురించి తెలుసుకుందాం..

చేతిలో డబ్బు నిలవడంలేదా.. సంపదను అడ్డుకునే మీ ఇంట్లోని వాస్తు దోషాలే ఇవే.. వెంటనే ఇలా చేస్తే..
Vastu Tips For Money Flow
Krishna S
|

Updated on: Dec 14, 2025 | 10:14 AM

Share

మీరు ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు నిలబడటం లేదా..? అవకాశాలు దగ్గరగా వచ్చినట్లే వచ్చి దూరమవుతున్నాయా..? దీనికి మీ ప్రయత్నాలలో లోపం కాకుండా మీరు నివసించే లేదా పనిచేసే ప్రాంతంలోని శక్తి ప్రవాహమే కారణం కావచ్చు అంటున్నారు వాస్తు నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఒక భవనంలో శక్తి కదలిక అనేది వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మీ సంపద ప్రవాహాన్ని అడ్డుకునే కొన్ని సాధారణ వాస్తు దోషాలు, వాటికి పరిష్కారాలు గురించి తెలుసుకుందాం..

అస్తవ్యస్తంగా ఉన్న మీ వర్క్ ప్లేస్

మీరు కూర్చునే చోటు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఇరుకుగా, చీకటిగా ఉన్న మూలలో కూర్చుంటే మీ ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. మీరు కూర్చున్న చోటు నుండి ప్రధాన ద్వారం కనిపించేలా డెస్క్‌ను పెట్టండి. మీ డెస్క్‌ను ఎప్పుడూ శుభ్రంగా, ఖాళీగా ఉంచుకోండి. ఇది మీకు మంచి ఆలోచనలు రావడానికి సాయపడుతుంది.

లీక్ అవుతున్న పంపులు

వాస్తులో నీరు అంటే డబ్బు, సంపద. ఇంట్లో పంపులు లీక్ అవుతుంటే లేదా నీరు వృథా అవుతుంటే.. మీ డబ్బు కూడా అలాగే నెమ్మదిగా పోతోందని అర్థం. లీకేజీలు కనిపించిన వెంటనే రిపేర్ చేయించండి. ఇంట్లో నీరు వృథా కాకుండా చూసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మూసుకుపోయిన ప్రధాన గుమ్మం

సానుకూల శక్తి మీ ఇంటిలోకి ప్రధాన ద్వారం ద్వారా వస్తుంది. గుమ్మం దగ్గర చెత్తాచెదారం, అడ్డంకులు ఉంటే లేదా తలుపు తెరవడం కష్టంగా ఉంటే కొత్త అవకాశాలు మీ ఇంటిలోకి రాకుండా ఆగిపోతాయి. గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, కాంతివంతంగా ఉంచండి. బూట్లు, పెట్టెలు వంటి అనవసరమైన వస్తువులను అక్కడ ఉంచకండి.

వాయువ్యం శుభ్రంగా లేకపోవడం

వాయువ్య దిశ కదలిక.. లాభాలు, ఆర్థిక అవకాశాలకు సంబంధించినది. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా.. వాడని వస్తువులతో నింపేస్తే, మీకు వచ్చే మంచి అవకాశాలు దూరమవుతాయి లేదా ఆదాయం స్థిరంగా ఉండదు. వాయువ్య దిశను శుభ్రంగా ఉంచి, గాలి గంటలు లేదా చిన్న అలంకరణ వస్తువులను ఉంచడం మంచిది.

ఇంట్లో చిందరవందరగా వస్తువులు

చాలా మంది ఇళ్లలో ఉండే పెద్ద సమస్య ఇదే. వాడని వస్తువులు.. చిందరవందరగా ఉన్న చోట సానుకూల శక్తి నిలిచిపోతుంది. దీని వల్ల ఒత్తిడి పెరిగి ఆలోచనలు స్పష్టంగా ఉండక, డబ్బు విషయంలో కూడా గందరగోళం ఏర్పడుతుంది. మీకు అవసరం లేని వస్తువులను ఎప్పటికప్పుడు తీసేయండి. ఇల్లు పద్ధతిగా ఉంటే మనసు కూడా స్పష్టంగా ఉంటుంది. అప్పుడు డబ్బు విషయంలో కూడా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..