Video: నదిలో 1000 శివలింగాలు.. ప్రకృతి చెక్కిన అద్భుతం.. ఎప్పుడు కనిపిస్తాయో తెలుసా..?
కర్ణాటకలోని సిర్సి వద్ద శాల్మల నదిలో వెయ్యి శివలింగాలున్న సహస్రలింగం అద్భుత ఆధ్యాత్మిక ప్రదేశం. రాజు సదాశివరాయ నిర్మించిన ఈ లింగాలు నది నీరు తగ్గినప్పుడు దర్శనమిస్తాయి. ఇటీవల వైరల్ వీడియోతో మరింత ప్రాచుర్యం పొందిన ఈ క్షేత్రం.. భారతీయ సంస్కృతికి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. దీన్ని చరిత్ర ఏంటంటే..?

భారతదేశం అద్భుతమైన దేవాలయాలు, అపురూపమైన ప్రకృతి సౌందర్యానికి నిలయం. అలాంటి అద్భుతమైన ప్రదేశాలలో ఒకటి కర్ణాటకలోని సిర్సి పట్టణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ తీర్థయాత్ర స్థలం సహస్రలింగం. శాల్మల నది ఒడ్డున ఉన్న రాళ్లపై దాదాపు 1,000 శివలింగాలు చెక్కబడి ఉండటం ఈ ప్రాంతం ప్రత్యేకత. ఈ అద్భుతమైన దృశ్యం కారణంగా దేశం నలుమూలల నుండి భక్తులు మరియు పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో వల్ల ఈ సహస్రలింగం దైవిక సౌందర్యం దేశవ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు.. ‘‘శివలింగాలతో నిండిన నది.. సదాశివ-అరాయవర్మ రాజు శాల్మల నది వెంట రాళ్లతో చెక్కిన ప్రతి లింగం నంది ఉంటుంది. నీరు తగ్గినప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది’’ అనే క్యాప్షన్ యాడ్ చేశారు.
ఈ వీడియో ప్రకారం.. నదిలో నీటి మట్టం తగ్గినప్పుడు దాదాపు వెయ్యికి పైగా శివలింగాలు దర్శనమిస్తాయి. భక్తులు ఆ లింగాలకు దండలు, పువ్వులు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి నెటిజన్లు ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఈ అమూల్యమైన వారసత్వాన్ని కాపాడుకోవాలని, ఇప్పటికే కొన్ని లింగాలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సహస్రలింగం వెనుక చరిత్ర
ఈ వెయ్యి లింగాలను 1678 నుండి 1718 మధ్య కాలంలో రాజు సదాశివరాయ నిర్మించారు. ఇక్కడ రాళ్లపై చెక్కి ప్రతి శివలింగం ముందు నంది ఉంటుంది. టి మట్టం తక్కువగా ఉన్నప్పుడు ఈ చెక్కడాలు పూర్తిగా కనిపిస్తాయి. మహా శివరాత్రి పండుగ సమయంలో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. ఈ లింగాలు సృజనాత్మక శక్తికి చిహ్నాలని, వీటిపై ప్రవహించే నది నీరు పక్కనే ఉన్న పొలాలకు సారాన్ని పెంచుతుందని స్థానికులు బలంగా నమ్ముతారు.
క్బాల్ స్పీన్‌తో పోలిక
సహస్రలింగం, కంబోడియాలోని క్బాల్ స్పీన్ లేదా హెడ్ బ్రిడ్జ్ అనే మరో ప్రదేశాన్ని పోలి ఉంటుంది. అక్కడ కూడా నదిలో వెయ్యి శివలింగాలు చెక్కి ఉన్నాయి. అయితే, సహస్రలింగంలా కాకుండా కంబోడియాలోని ఆ ప్రదేశాన్ని సందర్శించడం కొంచెం కష్టం. దానిని హిందువులు అంతగా పవిత్రంగా చూడరు. ఈ అరుదైన పవిత్రమైన ప్రాంతం భారతీయ సంస్కృతికి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
View this post on Instagram




