Vastu Tips: ఇంటికి ఏ దిశలో ఏయే వస్తువులు ఉంటే మంచిదో తెలుసా..? ఇలా చేస్తే ఇంట్లోని ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు చెక్..

Vastu Tips for Directions: సనాతన హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రముఖ స్థానం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లోని వస్తువులను పెట్టే విషయంలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను, కట్టడాలను ఉంచడానికి నిర్ణయించబడిన దిక్కులనే ఉపయోగించాలి. లేకపోతే ఆ ఇంట్లోని..

Vastu Tips: ఇంటికి ఏ దిశలో ఏయే వస్తువులు ఉంటే మంచిదో తెలుసా..? ఇలా చేస్తే ఇంట్లోని ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు చెక్..
Vastu Tips For 8 Directions
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 19, 2023 | 5:54 AM

Vastu Tips for Directions: సనాతన హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రముఖ స్థానం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లోని వస్తువులను పెట్టే విషయంలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను, కట్టడాలను ఉంచడానికి నిర్ణయించబడిన దిక్కులనే ఉపయోగించాలి. లేకపోతే ఆ ఇంట్లోని వారిలో విబేధాలు, ఆర్థికారోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. ముఖ్యంగా వాస్తు దోషాలుగా మారి ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తాయి. అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏ వస్తువు ఉండాలలో ఇప్పుడే తెలుసుకుందాం..

ఉత్తర దిక్కు: వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కు సంపద, వృత్తికి తగిన ప్రాంతం. అందువల్ల ఇది ప్రవేశ ద్వారం, పడకగది, గది, తోట, వాకిలి, యార్డ్, బాల్కనీకి అనుకూలంగా ఉంటుంది.  ఇంకా ఈ దిశలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా ఉత్తమంగా ఉంటుంది.

దక్షిణ దిక్కు: ఈ దిశ కీర్తికి రాజ్యం వంటిదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఆ కారణంగా మాస్టర్ బెడ్‌రూమ్, సీఈఓ ఆఫీస్, ఎంటర్టైన్మెంట్ రూమ్‌కు ఇది మంచి ప్రాంతమని పేర్కొనవచ్చు.

ఇవి కూడా చదవండి

పశ్చిమ దిక్కు: కుటుంబంలోనివారికి శక్తినిచ్చే ప్రాంతం పశ్చిమం. ఈ ప్రాంతాన్ని భోజన స్థలం కోసం ఉపయోగించవచ్చు. ఇంకా పడమటి వైపున ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు పెట్టుకోవడానికి మంచి ప్రదేశం.

తూర్పు దిక్కు: ప్రాణం ఇచ్చే సూర్యుడి పాలనలో తూర్పు దిక్కు ఉంటుంది. ఆ కారణంగానే చాలా మంది దీన్ని ప్రవేశించడానికి గొప్ప దిశగా చెబుతుంటారు. పైగా తూర్పు దిక్కు నుంచి ఉదయం వేళలో వచ్చే సూర్యకాంతి మీకు ఆరోగ్యాన్నిస్తుంది. అందువల్ల ఈ దిశలో కిటికీలు, తలుపులు, బాల్కనీలు, తోటలు ఉండటం ముఖ్యం. లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, ఫ్యామిలీ లాంజ్ కోసం కూడా ఈ దిక్కు అనువైనది.

ఈశాన్య దిక్కు: ఈశాన్యం మనశ్శాంతిని కలిగి ఉండే ప్రదేశం. ఈ దిశలో ధ్యానం లేదా ప్రార్థన గదిని ఏర్పాటు చేయవచ్చు. ఫ్యామిలీ లాంజ్ లేదా యోగా రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మంచిది.

వాయువ్య దిక్కు: వాయువ్య ప్రాంతం గాలికి ప్రధాన భాగం. ఎలివేటర్లు, రిఫ్రిజిరేటర్లు, మరుగుదొడ్లు, గెస్ట్ రూమ్ వంటివాటిని ఈ దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు.

నైరుతి దిక్కు: కుటుంబ సభ్యలకు బలాన్నిచ్చే ప్రాంతం నైరుతి. ఈ ప్రదేశంలో ఇంట్లోని బరువైన వస్తువులను పెట్టుకోవచ్చు.

ఆగ్నేయ దిక్కు: ఆగ్నేయం ఇంటి యజమానుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ దిశలో వంటగది, ఆఫీసు క్యాంటీన్ లేదా ఎలక్ట్రిక్ బోర్డ్ వంటివాటిని పెట్టుకోవచ్చు. ఇంకా ఆగ్నేయ దిశను క్రియేటివ్ వర్క్స్ కోసం కూడా ఉపయోగించవచ్చు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ