Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: భార్యాభర్తల మధ్య వివాదాలా.. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఈ పరిహారాలు చేసి చూడండి..

భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదాల  కుటుంబ సభ్యులు టెన్షన్‌లో ఉంటారు. ఇద్దరి మధ్య ప్రేమను తిరిగి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అయితే కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదనిపిస్తే.. జ్యోతిష్య శాస్త్రంలో ఇటువంటి అనేక నివారణలు ఉన్నాయి.

Astro Tips: భార్యాభర్తల మధ్య వివాదాలా.. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఈ  పరిహారాలు చేసి చూడండి..
Astro Tips For Happy Marrie
Follow us
Surya Kala

|

Updated on: May 19, 2023 | 6:53 AM

జీవిత భాగస్వామితో సరైన అవగాహన .. తనతో పాటు నడవలేని సమయంలో వైవాహిక జీవితం అధ్వాన్నంగా మారుతుంది. రోజూ చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుంటాయి. భార్యాభర్తల మధ్య దూరం పెరిగి.. వైవాహిక జీవితం మీకు భారంగా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్త సంబంధాల మధ్య దూరం పెరుగుతుంది. విడిపోవడం తప్ప మరో మార్గం లేదనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదాల  కుటుంబ సభ్యులు టెన్షన్‌లో ఉంటారు. ఇద్దరి మధ్య ప్రేమను తిరిగి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అయితే కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదనిపిస్తే.. జ్యోతిష్య శాస్త్రంలో ఇటువంటి అనేక నివారణలు ఉన్నాయి. ఈ నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా చెడిపోయిన మీ వైవాహిక జీవితం మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది. దంపతుల మధ్య ప్రేమ జీవితంలో మరోసారి తిరిగి వస్తుంది.

  1. భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా ఇష్టం లేకుంటే. చిన్న చిన్న విషయాలకే ఇబ్బంది పడుతుంటే భార్య తల కింద కర్పూరం పెట్టుకుని రాత్రి పడుకోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి ఆ కర్పూరాన్ని వెలిగించండి. దీనితో భార్యాభర్తల మధ్య సంబంధం మెరుగుపడటం ప్రారంభమవుతుంది. పరస్పర విబేధాలు కూడా దూరమవుతాయి.
  2. భార్యాభర్తల మధ్య కలహాలు తొలగాలంటే శివపార్వతుల ముందు నెయ్యి దీపం వెలిగించి ప్రార్థించాలి. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకోవాలి. దీనితో పాటు, శివ చాలీసా చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది. శివపార్వతుల ఆశీర్వాదాన్ని ఇస్తుంది.
  3. శుక్రవారం రోజున మహాలక్ష్మీ దేవిని, విష్ణుమూర్తిని పూజించండి. గులాబీ పువ్వులు సమర్పించండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుందని నమ్మకం. గొడవలు క్రమంగా  ముగుస్తాయి.
  4. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో కుజుడు సరిగా లేకపోయినా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి. సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి జ్యోతిష్యం చాలా ప్రభావవంతమైన మార్గాన్ని సూచించింది. పసుపు గుడ్డలో పసుపు ముడిని కట్టండి. దీని తర్వాత జప మాల తీసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి. ఆ తర్వాత మాలను దేవుడికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం తిరిగి రావడం ప్రారంభమవుతుంది.
  5. ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..