- Telugu News Photo Gallery Spiritual photos Know about Lord Vishnu famous five temples from Badrinath to Tirupati Balaji
Vishnu Temples: దేశంలోని 5 ప్రసిద్ధ విష్ణు దేవాలయాలు .. వాటి విశిష్టత గురించి తెలుసుకోండి
సనాతన హిందూ ధర్మంలో త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువు లోక రక్షకుడిగా పరిగణించబడుతున్నాడు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహా విష్ణువును ముందుగా పూజిస్తారు. హరి అనుగ్రహం ఎవరిపై కురుస్తుందో వారిపట్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని విశ్వాసం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న మానవ జీవితంలో దేనికీ లోటు ఉండదు. జీవితంలోని అన్ని ఆనందాలను అనుభవించిన తరువాత, అతను చివరకు శ్రీ హరి పాదాల వద్ద చోటు పొందుతాడు.
Updated on: May 18, 2023 | 2:02 PM


బద్రీనాథ్ ధామ్ (ఉత్తరాఖండ్) ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయం చార్ ధామ్‌లలో ఒకటి. ఈ చార్ ధామ్ ఆలయంలో బద్రీ స్వామిని దర్శించుకున్న వారికి అన్ని తీర్థయాత్రల దర్శన ఫలాలు లభిస్తాయని విశ్వాసం. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు. శ్రీ మహావిష్ణువు విగ్రహం శాలిగ్రామ రాతితో చేయబడింది. బద్రీనాథ్ స్వామిని దర్శించుకోవడానికి విదేశాల నుండి కూడా ఉత్తరాఖండ్ చేరుకుంటారు.

తిరుపతి వెంకటేశ్వర స్వామి (ఆంధ్రప్రదేశ్) ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల గిరిపై ఉన్న ఈ ఆలయం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలో ఉన్న ఈ విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి, మలయప్ప స్వామి, బాలాజీ అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఇక్కడ స్వామివారి విగ్రహ ప్రత్యేకత ఏమిటంటే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ చెమటతో స్నానం చేస్తూ ఉంటుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో గోవిందుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు.ఆ లయంలో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది.

పద్మనాభస్వామి ఆలయం (కేరళ) కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. శ్రీ హరి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుండి చేరుకుంటారు. ఈ ఆలయం దేశంలోని గొప్ప దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆలయ గర్భగుడిలో శ్రీ హరి విగ్రహం లభించిందని.. అక్కడే అదే స్థలంలో స్వామిని ప్రతిష్టించారు. అనంతం అనే పాముపై లక్ష్మీపతి భుజంగుడు శయన భంగిమలో ఉన్నాడు. పురుషులు సాంప్రదాయ దుష్టులైన ధోతీ పంచను మాత్రమే ధరించి ఆలయంలోకి ప్రవేశించవచ్చు. మరోవైపు మహిళలు జీన్స్, స్కర్టులు వంటి ఆధునిక దుస్తులు ధరించి ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి లేదు.

పండరీపురం ఆలయం (మహారాష్ట్ర) పండరీపురం శ్రీ పాండురంగ విఠల స్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు నడుముపై చేయి వేసుకున్నట్లుగా ఉంటుంది. కన్నయ్యతో పాటు రుక్మిణి కూడా పూజలను అందుకుంటుంది. విఠల దర్శనం కోసం ఉత్పన్న ఏకాదశి రోజున భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం లక్షలాది మంది ప్రజలు వస్తారు. విఠల దర్శనార్ధం చేసే ఈ తీర్థయాత్రను వారి-వర్కరి అని పిలుస్తారు. విశ్వాసం ప్రకారం.. భక్తుడైన పుండలుకుడి ఆజ్ఞలను అనుసరించి కృష్ణుడు తన నడుముపై చేయి వేసుకుని నిలబడ్డాడు. అప్పటి నుండి నడుముపై చేయి వేసుకున్న విగ్రహానికి భక్తులు పూజలను చేస్తారు.






























