Turmeric Remedies: జాతకంలో గురు దోషం ఉందా.. వివాహంలో ఆటంకాలా.. పసుపుతో ఈ పరిహారాలు చేసి చూడండి..
హిందూ మత విశ్వాసాల ప్రకారం పసుపు దేవగురు బృహస్పతికి సంబంధించినది. పసుపుని ఉపయోగించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు. పసుపులేని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతోంది. ఎవరి జాతకంలో గురుగ్రహానికి సంబంధించిన దోషాలు ఉంటే.. పసుపుకు సంబంధించిన కొన్ని పరిహారాలు కష్టాలను తొలగిస్తాయి.
వంటిల్లే ఔషధాల గని.. పసుపుని ఆరోగ్యం కోసం ఔషధంగా వినియోగిస్తారు. అంతేకాదు పూజాదికార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. హిందూ సనాతన సంప్రదాయంలో అన్ని రకాల శుభ కార్యాల్లో పసుపును ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వివాహమైనా, పూజకైనా పసుపు తప్పకుండా ఉండాల్సిందే. హిందూ మత విశ్వాసాల ప్రకారం పసుపు దేవగురు బృహస్పతికి సంబంధించినది. పసుపుని ఉపయోగించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు. పసుపులేని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతోంది. ఎవరి జాతకంలో గురుగ్రహానికి సంబంధించిన దోషాలు ఉంటే.. పసుపుకు సంబంధించిన కొన్ని పరిహారాలు కష్టాలను తొలగిస్తాయి. ఈ రోజు పసుపుకు సంబంధించిన నివారణలను గురించి తెలుసుకుందాం.
- సనాతన హిందూ విశ్వాసం ప్రకారం.. ఎవరి జాతకంలో దేవగురువు బృహస్పతికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే.. పూజ సమయంలో పసుపును ఉపయోగించండి. నుదుటిపై పసుపును తిలకంగా దిద్దుకోండి. మెడ, మణికట్టు మీద పసుపు బొట్టు పెట్టుకోవడం జాతకంలో బృహస్పతిని బలపరుస్తుందని నమ్ముతారు. ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే కష్టాలు కూడా దూరమవుతాయి.
- మీకు లేదా కుటుంబంలో ఎవరికైనా వివాహానికి తరచుగా ఆటంకాలు ఎదురైతే.. ప్రతి గురువారం వినాయకుడిని పూజించండి. పూజ సమయంలో గణపతికి పసుపును సమర్పించండి. హిందూ మత విశ్వాసం ప్రకారం..ఈ పరిహారం చేసిన వారు జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు.
- ఉదయాన్నే స్నానానికి ముందు నీళ్లలో కొద్దిగా పసుపు వేస్తే మంచిదని భావిస్తారు. ఇలా చేయడం వలన మీ శరీరం, మనస్సు రెండింటినీ శుద్ధి చేస్తుంది. దీనితో పాటు ఎవరైనా కెరీర్‌లో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటున్నట్లయితే, పసుపుకు సంబంధించిన ఈ పరిహారం ప్రయోజనకరంగా ఉంటుంది.
- వైవాహిక జీవితంలో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే, ఇంటి ప్రధాన గోడపై పసుపుతో స్వస్తిక చిహ్నాన్ని వేయండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ప్రేమ సంబంధాలు బలపడతాయని నమ్మకం.
- మీ ఇంట్లో ఎప్పుడూ ఇబ్బంది ఉంటే, లేదా ఇంట్లో ఏదో ఒక రకమైన ప్రతికూల శక్తి ఉందని మీరు భావిస్తే, ఒక కుండలో శుభ్రమైన నీటిని తీసుకుని, దానికి కొద్దిగా పసుపు, గంగాజలాన్ని కలపండి. తర్వాత ఈ నీటిని ఇంటింటా చల్లాలి. ఇలా చేయడం వల్ల దురదృష్టం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..