అమ్మ కోసం అభినవ శ్రవణ ‘కుమారుడి’ తాపత్రయం.. చెక్కబండిలోనే 100 కి.మీ కాలినడక.. తల్లి కోరిక తీర్చడం కోసం..

Son's Love For Mother: కొండగట్టు ఆంజనేయుని దర్శించుకోవడానికి కన్నతల్లిని తీసుకుని దాదాపు 100 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడో కొడుకు. కన్నతల్లి ఆరోగ్యం కోసం ఆ నిరుపేద కొడుకు తాపత్రయం అందరినీ ఆకట్టుకుంటోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన మల్లయ్య తల్లి అనారోగ్యంతో

అమ్మ కోసం అభినవ శ్రవణ ‘కుమారుడి’ తాపత్రయం..  చెక్కబండిలోనే 100 కి.మీ కాలినడక.. తల్లి కోరిక తీర్చడం కోసం..
Mallayya With His Mother
Follow us

|

Updated on: May 18, 2023 | 6:25 AM

Son’s Love For Mother: కొండగట్టు ఆంజనేయుని దర్శించుకోవడానికి కన్నతల్లిని తీసుకుని దాదాపు 100 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడో కొడుకు. కన్నతల్లి ఆరోగ్యం కోసం ఆ నిరుపేద కొడుకు తాపత్రయం అందరినీ ఆకట్టుకుంటోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన మల్లయ్య తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. లక్షలు పోసి వైద్యం చేయించే పరిస్ధితిలో మల్లయ్య లేడు. కనీసం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో కొద్దిరోజులు వుంటే తల్లి ఆరోగ్యం బాగుపడుతుందని మల్లయ్య భావించాడు. కానీ ఏదో వాహనంలోనో తల్లిని కొండగట్టుకు తీసుకువెళ్లే ఆర్ధిక స్తోమత కూడా అతనికి లేదు. అలాగని తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటూ చూస్తూ వుండలేకపోయాడు.

మరి ఏం చేయాలా అని మదనపడుతున్న సమయంలో మల్లయ్యకు ఓ ఆలోచన వచ్చింది. స్వయంగా తానే చెక్కలతో ఓ వాహనాన్ని తయారుచేసుకున్నాడు. నడవలేని స్థితిలో వున్న తల్లిని ఆ బండిలో కూర్చోబెట్టి తోసుకుంటూ కొండగట్టుకు బయలుదేరాడు. ఇలా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని కొండగట్టుకు చేరి ఆంజనేయస్వామి సన్నిధిలో నెలరోజులు ఉండి తిరుగు ప్రయాణమయ్యాడు మల్లయ్య. తన ప్రయాణంపై ప్రశ్నించినవారితో.. డబ్బులు లేకపోయినా తల్లిపై ప్రేమ వుందని.. అదే తనను నడిపిస్తోందన్నాడు మల్లయ్య. తల్లి ఆరోగ్యం బాగుపడాలనే ఇదంతా చేస్తున్నానన్నాడు. తల్లి ఆరోగ్యం కోసం ఎక్కడికయినా వెళతానని చెప్పాడు.

ఇలా తల్లిపై ప్రేమతో ఆ కొడుకు అభినవ శ్రవణ కుమారుడిగా మారాడు. ఈ విధంగా ఎర్రటి ఎండలో బండి తోసుకుంటూ రానుపోను దాదాపు 200 కిలోమీటర్లు మల్లయ్య చేస్తున్న ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. తల్లదండ్రుల్ని బరువుగా భావించే కొడుకులే ఎక్కువగా కనపడుతున్న సమాజంలో తన తల్లిపై మల్లయ్య చూపిస్తున్న ప్రేమ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!