AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత స్ట్రాటజీని మార్చిన గులాబీ దళపతి.. వ్యూహాత్మకంగా ముందుకు..

కేసీఆర్‌ కొత్త స్లోగన్‌ వచ్చేసింది. ఇన్నాళ్లు ఒక ఎత్తైతే.. ఇప్పటి నుంచి మరో ఎత్తు. ఎందుకంటే.. మిగిలున్న ఐదు నెలలు బీఆర్‌ఎస్‌కు కీలకం. అందుకే దశాబ్దంలోనే.. శతాబ్దం అభివృద్ధి చేశామన్నదే కేసీఆర్‌ నినాదం. ఎందుకంటే.. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత స్ట్రాటజీని మార్చిన గులాబీ దళపతి.. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రజల్లోనే ఉంటూ.. ప్రజలకు వివరించాలంటూ నేతలకు సైతం స్ట్రాంగ్‌ సిగ్నల్స్‌ పంపారు బాస్‌.

CM KCR: కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత స్ట్రాటజీని మార్చిన గులాబీ దళపతి..  వ్యూహాత్మకంగా ముందుకు..
CM KCR
Sanjay Kasula
|

Updated on: May 18, 2023 | 7:43 AM

Share

కొద్దీ రోజుల గ్యాప్‌లోనే గులాబీ బాస్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) వరుస సమావేశాలపై పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి  పెంచారు. మొన్నటి సమావేశంలోనే రాబోయే ఎన్నికలపై పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్, మూడు వారాల్లోనే మళ్లీ బీఆర్‌ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహమే ఎజెండాగా సాగిందీ ఈ మీటింగ్‌. పోయిన మీటింగ్‌లోనే ఆర్నెల్లలో ఎన్నికలని గుర్తుచేసిన సీఎం కేసీఆర్‌..ఈసారి బీ రెడీ అంటూ అందరినీ అలర్ట్‌ చేశారు గులాబీ దళపతి.

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 6నెల్లలో ఎన్నికలు ఉన్నాయని, ఎన్నికల షెడ్యూల్‌ తీసేస్తే మిగిలేది 5 నెలల సమయమే ఉందని కేడర్‌కి గుర్తు చేశారు. నేతలు పూర్తిస్థాయిలో నియోజకవర్గాలకు పరిమితం కావాలన్నారు. తెలంగాణ తెచ్చింది మనమే,అభివృద్ధి చేసింది మనమేనన్నారు. మళ్లీ మూడు వారాల్లోనే ఎమ్మెల్యే, ఎంఎల్‌సీ, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహమే ఎజెండాగా సాగిందీ మీటింగ్‌.

6నెల్లలో ఎన్నికలు..5 నెలలే సమయం

ఈ దశాబ్ధకాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేస్తూ ప్రజలతో కలిసి వేడుకలు జరుపుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్‌. సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయన్న సీఎం కేసీఆర్‌.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామన్న సీఎం కేసీఆర్‌ ఇచ్చిన కొత్త స్లోగన్‌తో ప్రజల్లోకి వెళ్తామన్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి. కర్నాటకలో బీజేపీ చతికిలబడిందని, మరో దారిలేక ప్రజలు అక్కడ కాంగ్రెస్‌కు ఓటేశారని విమర్శించారు.

ఉత్సవాలను పండుగలా జరుపుతాం..

దశాబ్ధకాలం ఉత్సవాలను పండుగలా జరుపుతామన్నారు మంత్రి మల్లారెడ్డి. సర్వేల ప్రకారం 103 సీట్లు వస్తాయని, మూడోసారి హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమన్నారు. మొత్తానికి బీజేపీపై ఇప్పటికే గురిపెట్టిన గులాబీబాస్‌ కర్నాటక ఫలితాలతో ప్రత్యర్థులకు ఎక్కడా అవకాశం ఇవ్వొద్దని దిశానిర్దేశం చేశారు. ఓ పక్క బీజేపీ మరోవైపు కాంగ్రెస్‌.. విజయంపై ఆ రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్న టైంలో హ్యాట్రిక్ విక్టరీ కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం