Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR’s Son: బాసర అమ్మవారిని దర్శించుకున్న హిమాన్షురావు.. ఆ వెంటనే యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి దర్శనం కూడా..

KTR's Son: ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌నువ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు రావు.. తెలంగాణలోని రెండు ప్రధాన ఆలయాలను దర్శించుకున్నారు. ముందు శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న హిమాన్షు రావు.. సాయంత్రం స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేశారు. హిమన్షురావు రాకతో రెండు ఆలయాల్లో యువకులు, భక్తులు సందడి చేశారు.

KTR's Son: బాసర అమ్మవారిని దర్శించుకున్న హిమాన్షురావు.. ఆ వెంటనే యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి దర్శనం కూడా..
Himanshu Rao In Basara Temple
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 18, 2023 | 6:05 AM

KTR’s Son: దక్షిణ భారత దేశంలోని చదువుల తల్లి నిలయమైన బాసర ఆలయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తనయుడు హిమన్ష్ రావు దర్శించుకున్నారు. ముధోల్ ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలయానికి చేరుకున్న హిమాన్షు రావుకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేసిన హిమన్షు రావుకు ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్ , ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ ఆధ్వర్యంలో అమ్మవారి తీర్థ ప్రసాదంను అందజేసి ఆశీర్వదించారు.

అనంతరం మహంకాళి ఆలయం వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక బుధరవారం సాయంత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని హిమాన్షు తన స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు. యాదగిరిక్షేత్ర సందర్శనకు వచ్చిన హిమాన్షుకు కొండ కింద వైకుంఠద్వారం వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడినుంచి ఆయన కొండపైన పడమటి దిశలోని లిఫ్టు గుండా తిరువీధుల్లోకి వచ్చారు. పడమటి సప్తతల మహారాజగోపురం గుండా ప్రదానాలయంలోనికి వెళ్లారు. హిమాన్షుకు దేవస్థాన అధికారులు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించగా, గర్భాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాకార మండపంలో అర్చకులు హిమన్ష్ రావుకు ఆశీర్వచనం చేశారు. దేవస్థాన అధికారులు ఆయనకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులతో సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. తూర్పు పంచతల రాజగోపురం నుంచి బయటకు వచ్చిన ఆయన భక్తులతో మాట్లాడుతూ లిఫ్టు వద్దకు చేరుకుని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..