Rashtrapati Nilayam: సామన్యుల కోసమే సువర్ణావకాశం.. సందర్శనకు హైదరాబాద్ రాష్ట్రపతి నిలయం.. ఎప్పటి నుంచి అంటే..?
Hyderabad Rashtrapati Bhavan: హైదారాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం గేట్లు సందర్శకులకోసం తెరుస్తున్నారు. జూన్ 1 నుంచి ప్రజలు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చు. ప్రజల సందర్శనార్ధం హైదారాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం గేట్లు..
Hyderabad Rashtrapati Bhavan: హైదారాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం గేట్లు సందర్శకులకోసం తెరుస్తున్నారు. జూన్ 1 నుంచి ప్రజలు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చు. ప్రజల సందర్శనార్ధం హైదారాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం గేట్లు తెరుచుకోనున్నాయి. జూన్ 1 నుంచి వారంలో ఆరు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. దీనిపై రాష్ట్రపతి సచివాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోమవారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ప్రజలు సందర్శించవచ్చని ప్రకటనలో తెలిపారు.
కాగా, స్వాతంత్య్రానికి ముందు నిజాం ప్రభుత్వ ఆధీనంలో రెసిడెన్సీ హౌస్‌గా పిలువబడిన ఈ భవనం తర్వాత రాష్ట్రపతి నిలయంగా మార్చారు. ఏటా శీతాకాల విడిది కోసం, ఇతర సందర్భాలలో రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే విడిది చేస్తారు. రాష్ట్రాపతి నిలయం మొత్తం విస్తీర్ణం దాదాపు 90 ఎకరాలు. ఇందులోని భవనాలతోపాటు అమృత్ ఉద్యాన్, హెర్బల్ గార్డెన్, మ్యూజికల్ గార్డెన్ వంటివి సందర్శకులను ఆకర్షిస్తాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..