Tech Layoffs: వేలాది ఉద్యోగులపై మరోసారి వేటు.. ప్రకటించిన టెలికాం కంపెనీ.. అదే బాటలో అమెజాన్..

ప్రముఖ ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ప్రపంచ దిగ్గజ టెలికామ్‌ కంపెనీ వొడాఫోన్‌ రాబోయే మూడేళ్లలో 11 వేలమందిని ఇంటికి సాగనంపనుంది. ఇక అమెజాన్‌లో 500 మందిని ఇంటికి పంపుతున్నారు..

Tech Layoffs: వేలాది ఉద్యోగులపై మరోసారి వేటు.. ప్రకటించిన టెలికాం కంపెనీ.. అదే బాటలో అమెజాన్..
Tech Layoffs
Follow us

|

Updated on: May 17, 2023 | 6:10 AM

ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. లే ఆఫ్‌ల కాలం ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఐటీ దిగ్గజ కంపెనీలు సైతం కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా వొడాఫోన్‌ లేఆఫ్స్‌ ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్నాయి. లేటెస్ట్‌గా బ్రిటిష్‌ మల్టీనేషనల్‌ టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీ వొడాఫోన్‌ ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 11 వేల మందిని ఇంటికి పంపే పనిలో పడింది. అయితే ఒక్కసారిగా కాకుండా మూడేళ్ళలో ఈపనిచేయబోతోంది. ఫైనాన్షియల్‌ ఇయర్‌ 23 లో తమ పెర్‌ఫార్మెన్స్‌ తీవ్రంగా క్షీణించిందని ఆ కంపెనీ వెల్లడించింది.

ఇక అమెజాన్‌‌లో కూడా మరో విడత ఉద్యోగాల్లో కోత వేస్తున్నారు. 500 మందిని ఇంటికి పంపేందుకు ఆ కంపెనీ సిద్ధం అవుతోందని సమాచారం. వెబ్‌ సర్వీసులు, HR, సపోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. కాగా, వొడాఫోన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా 104,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్ళ క్రితం అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా వొడాఫోన్‌ రికార్డుల్లోకెక్కింది. అయితే తాజాగా ఉద్యోగాల తీసివేతలో పెర్‌ఫార్మెన్స్‌ని సాకుగా ఎంచుకుంది వొడాఫోన్‌.

ఇంకా యూకేలోని వొడాఫోన్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఈ ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఇతర దేశాల్లోని ఉద్యోగులకు ఉద్వాసన కార్యక్రమం మొదలుపెడుతోన్న వొడాఫోన్‌…తమ కంపెనీ షేర్లు లండన్‌లో 4 శాతం పడిపోయినట్టు వెల్లడించింది. తమ కంపెనీ పెర్‌ఫార్మెన్స్‌ సరిగా లేకపోవడమే ఉద్యోగాల కోతకు కారణమని ప్రకటించింది కంపెనీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?