Andhra Pradesh: ‘నాన్నకి అంత్యక్రియలు నేనే చేస్తా’.. తలకొరివి పెట్టి పితృఋణం తీర్చుకున్న కూతురు..

Funeral Rituals: చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టడానికి కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించిన ఘటన అల్లూరి జిల్లా పాడేరులో జరిగింది. అల్లూరి జిల్లా పాడేరు లో రమణ అనే నాయీ బ్రాహ్మణుడు బుధవారం మృతి..

Andhra Pradesh: ‘నాన్నకి అంత్యక్రియలు నేనే చేస్తా’.. తలకొరివి పెట్టి పితృఋణం తీర్చుకున్న కూతురు..
Man's Funeral In Paderu
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 18, 2023 | 6:15 AM

Funeral Rituals: చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టడానికి కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించిన ఘటన అల్లూరి జిల్లా పాడేరులో జరిగింది. అల్లూరి జిల్లా పాడేరు లో రమణ అనే నాయీ బ్రాహ్మణుడు బుధవారం మృతి చెందాడు. అతనికి వారసులు లేకపోవడంతో కూతురే తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. కన్నీళ్లు నిండిన కళ్ళతో, బరువెక్కిన గుండెతో తలకొరివి పెట్టి తండ్రి ఋణం తీర్చుకుంది. కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉన్న రమణ నిన్న గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. రమణకు ముగ్గురు సంతానం, ముగ్గురూ కూతుర్లే. వారసులు లేకపోవడంతో ముగ్గురు కూతుళ్ళలో పెద్ద కుమార్తె స్వాతి.. ‘నాన్నకి అంత్యక్రియలు నేనే చేస్తా’నని ముందుకొచ్చింది. అన్నీ తానై తన తండ్రికి అంతిమ సంస్కారాలు స్వయంగా నిర్వహించింది.

ఎంతగానో ప్రేమించే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుమార్తెలు తల్లడిల్లిపోయారు. ఇక తాము ఎవరి కోసం బతికేదంటూ కన్నీరు మునిరై విలపించారు. ముఖ్యంగా పెద్ద కుమార్తె స్వాతిని ఓదార్చడం చుట్టుపక్కలవారికి కష్టమైంది. ఆమె ఆవేదన అందరినీ కలచి వేసింది. గుండె నిండా బాధ, కన్నీళ్లు నిండిన కళ్ళతో వస్తున్న దు:ఖ్ఖాన్ని దిగమింగుకుని బంధువులు, ఇరుగుపొరుగు సహకారంతో.. తండ్రికి అంత్యక్రియలు పూర్తిచేసింది స్వాతి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్