Governor Tamilisai: విద్యార్థులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి.. ‘నూతన ఆవిష్కరణలలో భారత్ ముందుంది’ అంటూ..

TS Governor Tamilisai: నూతన ఆవిష్కరణలు తయారు చేయడంలో భారతదేశం ముందుదన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. చిన్న చిన్న ఆలోచనలతో చేపట్టిన కార్యక్రమాలు నేడు ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయన్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలని..

Governor Tamilisai: విద్యార్థులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి.. ‘నూతన ఆవిష్కరణలలో భారత్ ముందుంది’ అంటూ..
Telangana Governor Tamilisai
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 18, 2023 | 5:40 AM

TS Governor Tamilisai: నూతన ఆవిష్కరణలు తయారు చేయడంలో భారతదేశం ముందుదన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. చిన్న చిన్న ఆలోచనలతో చేపట్టిన కార్యక్రమాలు నేడు ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయన్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలని.. దేనికి భయపడకుండా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు తమిళసై. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు కళాశాల యాజమాన్యం స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ విద్యార్థులు తయారు చేసిన నూతన ఆవిష్కరణలు ఆమె పరిశీలించారు. విద్యార్థుల క్రియేటివిటీని ఆమె అభినందించారు.

ఆమె మాట్లాడుతూ ఇండియా కరోనా వ్యాక్సిన్ తయారు చేసి 160 దేశాలకు పంపిణీ చేసిందని తమిళిసై గుర్తు చేశారు. నూతన ఆవిష్కరణలు రూపొందించడంలో మన దేశం ముందుందన్నారు. చిన్న చిన్న ఆలోచన లతో చేపట్టిన కార్యక్రమాలు నేడు ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయన్నారు. భారతలో తయారైన వస్తువులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, తెలంగాణాలో తయారైన ఫార్మాని పుదుచ్చేరికి ఇవ్వడం సంతోషదాయకం, తెలంగాణాకు గర్వ కారణమన్నారు.

ఇవి కూడా చదవండి

అదే విధంగా దేశంలో మన అలవాట్లు, సంప్రదాయాలు చాలా గొప్పవని తెలిపారు గవర్నర్‌. యువత కూడా వాటిని ఫాలో కావాలని సూచించారు. యువత చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు తమిళిసై. జీవితాన్ని ఎంజాయ్ చేయండి.. దేనికి భయపడవద్దు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఉన్న లక్ష్యాలతో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలననారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయండి. ఈ దేశానికి సేవలందించండి.. భావి భారత పౌరులుగా ఎదగండి.. రాజకీయాల ను ఆస్వాదించండి…రాజకీయాల గురించి కూడా ఆలోచించండి’ అని ఆమె అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..