AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కోవెలకుంట్ల బాలికల కిడ్నాప్ కథ సుఖాంతం.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు.. ఎలా సాధ్యమైందంటే..?

నంద్యాలలో సంచలనం సృష్టించిన ఇద్దరు బాలికల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కిడ్నాప్‌ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికలను వేరే ప్రాంతానికి తరిలిస్తున్న సమయంలో పట్టుకొని.. చిన్నారులను తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. 

Andhra Pradesh: కోవెలకుంట్ల బాలికల కిడ్నాప్ కథ సుఖాంతం.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు.. ఎలా సాధ్యమైందంటే..?
2 Minor Girls with Kidnapper Imam Hussain
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 18, 2023 | 6:10 AM

Share

అక్కడ పోలీసుల బందోబస్తు ఎక్కుగా ఉంటుంది. అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు పిల్లల కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. అందరి కళ్లుగప్పి.. పిల్లలను ఎత్తుకెళ్తున్నారు కిడ్నాపర్లు. ఎక్కడ చూసినా ఇటువంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా వీళ్లల్లో మాత్రం మార్పు రావడం లేదు. కానీ నిఘా నేత్రానికి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉండడంతో.. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లు దొరికిపోతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో అదృశ్యమైన బాలికలు విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆటో డ్రైవర్ ఇమామ్ హుస్సేన్ ఆ బాలికలను.. ఎత్తుకెళ్లాడు. మాయమాటలు చెప్పి బాలికలకు వెంట తీసుకెళ్లాడు. చిన్నారులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తమ విచారణలో భాగంగా చిన్నారుల కోసం అన్నిచోట్ల వెతికారు. అనుమానాస్తులను పదేపదే ప్రశ్నించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎక్కడ కూడా ఆచూకి లభించకపోవడంతో అన్ని జిల్లా పోలీసులను అలర్ట్‌ చేశారు. కిడ్నాప్‌ కేసు వివరాలు తెలుసుకున్న విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాపర్‌ కదలికలు గుర్తించేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు రైల్వే పోలీసులు. రైళ్లను తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అదృశ్యమైన బాలికల ఫోటోలతో పోలిన ఇద్దరు బాలికలు, మరొకడు కనిపించడంతో వారిని పట్టుకుని విచారించారు. దీంతో కోవెలకుంట్లలో అదృశ్యమైన బాలికలుగా గుర్తించి.. నిందితుడని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, గుంటూరు రాయగడ పాసింజర్‌లో బాలికలను ఎత్తుకు వచ్చాడు ఆటో డ్రైవర్ ఇమామ్ హుస్సేన్. అనంతరం నంద్యాల పోలీసులకు సమాచారం అందించారు విశాఖ రైల్వే పోలీసులు. బాలికలను కాపాడి క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. దీంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. నిందితుడు ఇమామ్ హుస్సేన్ అసలు బాలికలను ఎందుకు కిడ్నాప్‌ చేశాడు..? ఎవరికైనా అమ్మాలన్నా ఉద్దేశంతో కిడ్నాప్ చేశాడా? ఆతనికి కిడ్నాప్ ముఠాలతో సంబంధాలేవైనా ఉన్నాయా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..