Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ఏకాదశి వేడుకలు.. లోక క్షేమం కొరకు చక్రస్నానం

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు. అనంత‌రం శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పుణ్యస్నానం చేసి ఆలయానికి తీసుకొచ్చారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ఏకాదశి వేడుకలు.. లోక క్షేమం కొరకు చక్రస్నానం
Vaikuntadwara Sarva
Follow us
Surya Kala

|

Updated on: Dec 24, 2023 | 10:56 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ వైకుంఠ ద్వాదశి సందర్భంగా చక్రస్నాన మహోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్ర త్తాళ్వార్లను తిరుమాఢ వీధుల్లో ఊరేగింపు చేస్తూ.. శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయం ముఖ మండపంలో వేంచేపు చేశారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు. అనంత‌రం శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పుణ్యస్నానం చేసి ఆలయానికి తీసుకొచ్చారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఈ తీర్ధంలోని  పవిత్ర జలాలు పాపాలను శుభ్రపరిచే శక్తిని కలిగి ఉన్నాయని .. దైవిక ప్రభావంతో కోరుకున్న  వారికి దీవెనలను ప్రసాదించే శక్తిని కలిగి ఉన్నాయని చెబుతారు. ఈ పవిత్ర కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.

రోజూ వైకుంఠ ద్వారా దర్శనం స్లాట్ల వారీగా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను అనుమ‌తిస్తున్నారు. దర్శనం కోసం భారీ సంఖ్యలో క్యూలైన్ల‌లో ఉన్న భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, టీ, కాఫి, పాలు అందిస్తున్నారు. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌లిపి రోజుకు దాదాపు 70 వేల మందికి, 10 రోజుల్లో క‌లిపి దాదాపు 8 ల‌క్ష‌ల మందికి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు