Nani’s Paradise: నాని , శ్రీకాంత్ ఓదెల సినిమాలో విలన్‌గా ప్రముఖ నటుడు! ఎవరో తెలిస్తే తప్పక ఔరా అంటారు
ఆయన నటనలో వైవిధ్యం ఉంటుంది.. ఆయన రాసే మాటల్లో పదును ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తండ్రిగా, కమెడియన్‌గా మనందరినీ అలరించిన ఆ సీనియర్ నటుడు ఇప్పుడు తన పాత రూపాన్ని ఇండస్ట్రీలో ఆయన జర్నీ మొదలైంది నిలదొక్కుకున్నదీ, ప్రేక్షకులను అలరించింది అయిన తన నెగెటివ్ జానర్ నటనను ఇప్పుడు బయటకు తీయబోతున్నారు.

కెరీర్ మొదట్లో విలన్‌గా భయపెట్టిన ఆయన, చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక పవర్‌ఫుల్ ప్రతినాయక పాత్రలో మెరవబోతున్నారు. అది కూడా టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కావడం ఇప్పుడు విశేషం. ‘దసరా’ వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఆ క్రేజీ కాంబినేషన్‌లో ఈ సీనియర్ నటుడు విలన్‌గా నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరు? నానిని ఢీకొట్టబోతున్న ఆ పవర్‌ఫుల్ పాత్ర ఏంటి?
ది ప్యారడైజ్..
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ సినిమాలతో ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని, ఇప్పుడు తన తర్వాతి లక్ష్యాన్ని రూ.200 కోట్లుగా నిర్ణయించుకున్నారు. దీనికోసం తన ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో కలిసి ‘ది ప్యారడైజ్’ అనే భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా రాక్ స్టార్ అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Nani And Taniella Bharani
విలన్‌గా తనికెళ్ల భరణి..
ఈ సినిమాలో ఒక కీలకమైన విలన్ పాత్ర కోసం సీనియర్ నటుడు తనికెళ్ల భరణిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. “ప్రస్తుతం నేను చేస్తున్న ఒక పెద్ద ప్రాజెక్టులో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాను. కెరీర్ మొదట్లో చేసిన అటువంటి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని ఆయన చెప్పుకొచ్చారు. నాని లాంటి టాలెంటెడ్ హీరోతో తనికెళ్ల భరణి లాంటి దిగ్గజ నటుడు తలపడటం అంటే వెండితెరపై మాస్ జాతర ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
‘దసరా’ సినిమాలో స్నేహం గురించి చూపించిన శ్రీకాంత్ ఓదెల, ఈసారి ‘ది ప్యారడైజ్’లో తల్లి మరియు కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్‌ను చూపించబోతున్నారట. పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో పాటు హృదయాన్ని హత్తుకునే సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ మొదట ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్ల కొత్త రిలీజ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నాని నటన, అనిరుధ్ సంగీతం, తనికెళ్ల భరణి విలనిజం కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం.
