AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Investment: ఇది తెలియకుండా బంగారంలో ఇన్వెస్ట్‌ చేస్తే ప్రమాదకరం.. పెట్టుబడి చిట్కాలు!

Gold Investment: బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, భావోద్వేగం కూడా. ఆభరణాలుగా బంగారాన్ని ఉంచడం అత్యవసర నిధిగా ఉపయోగపడుతుంది. డిజిటల్ గోల్డ్ వంటి అన్ రెగ్యులేటెడ్ ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. గోల్డ్ స్కీమ్‌లు, గోల్డ్ ఓడీ వంటి ఎంపికలతో ఆభరణాల తయారీ ఛార్జీలను తగ్గించుకోవచ్చు.

Gold Investment: ఇది తెలియకుండా బంగారంలో ఇన్వెస్ట్‌ చేస్తే ప్రమాదకరం.. పెట్టుబడి చిట్కాలు!
Gold Investment
Subhash Goud
|

Updated on: Jan 25, 2026 | 7:16 AM

Share

Gold Investment: భారతీయులకు బంగారం కేవలం ఆస్తి లేదా పెట్టుబడి సాధనం మాత్రమే కాదు, అది సంప్రదాయం, గౌరవం, భావోద్వేగ భద్రతతో కూడిన నిధి. వివాహాలు, పండుగలు, శుభకార్యాలలో ఇది సంపదకు, లక్ష్మీదేవికి, కుటుంబ ప్రతిష్టకు ప్రతీకగా నిలుస్తుందని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (CFP) రామ్ ప్రసాద్ చెబుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన బంగారం ఇన్వెస్ట్‌మెంట్‌ అంశాలపై కీలక అంశాలను వెల్లడించారు. ఆపత్కాలంలో రక్షణగా నిలుస్తూ, తరతరాలుగా కొనసాగుతున్న బలమైన నమ్మకం. అయితే, బంగారంపై పెట్టుబడి పెట్టేటప్పుడు సరైన అవగాహన కలిగి ఉండటం అత్యవసరం. ప్రకారం, ఆభరణాల రూపంలో బంగారాన్ని కలిగి ఉండటం అత్యవసర నిధిగా ఉపయోగపడుతుంది. దీనిని బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందడానికి ఉపయోగించవచ్చు. అది కూడా బంగారం ధర తగ్గినప్పుడు విక్రయించకుండా తాకట్టు పెట్టే అవకాశం ఉంటుంది.

గతంలో బంగారం దీర్ఘకాలికంగా ప్రతికూల రాబడులను ఇచ్చిన సందర్భాలున్నాయి. అందుకే బంగారం ధర ఎప్పుడూ పెరుగుతుందనే అపోహను విడనాడాలి. డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి పేపర్ గోల్డ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతాయి. సెబీ లేదా ఆర్‌బీఐ నియంత్రణ లేని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టుబడి పెట్టడం అధిక రిస్క్‌తో కూడుకున్నది. మోసపూరిత క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా మోసాలు జరగవచ్చని ఆయన హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 22వ విడత ఎప్పుడు వస్తుంది? బడ్జెట్‌ తర్వాతనా ముందునా?

ఇవి కూడా చదవండి

ఆభరణాల కొనుగోలులో మేకింగ్ ఛార్జీలను తగ్గించడానికి గోల్డ్ స్కీమ్‌లను ఉపయోగించుకోవచ్చు. ఇవి అడ్వాన్స్ పర్చేస్ స్కీమ్‌ల కిందకు వస్తాయి. బంగారం పెట్టుబడి అనేది మొత్తం ఆర్థిక ప్రణాళికలో ఒక భాగం మాత్రమే ఉండాలి తప్ప, మొత్తం పెట్టుబడిని దానికే పరిమితం చేయకూడదు. బంగారం అనేది కేవలం ఒక పెట్టుబడి మార్గం మాత్రమే కాదు, భారతీయ కుటుంబాలకు ఒక బలమైన భావోద్వేగం కూడా. అయితే, బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో దానిపై పెట్టుబడి పెట్టేవారు కొన్ని కీలక విషయాలను తెలుసుకోవాలని అన్నారు.

SBI Charges: ఇక ఎస్‌బీఐలో ఈ ఉచిత సేవలు బంద్‌.. ఛార్జీలు చెల్లించాల్సిందే.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి..!

బంగారాన్ని ఆభరణాల రూపంలో ఉంచుకోవడం అత్యవసర పరిస్థితుల్లో ఒక బలమైన ఆసరాగా నిలుస్తుంది. బంగారం ధర తగ్గినప్పటికీ, మీరు ఆభరణాలను విక్రయించకుండా తాకట్టు పెట్టి రుణం పొందవచ్చు. దీనికి సిబిల్ స్కోర్ లేదా ఆదాయ రుజువు అవసరం ఉండదు. ఇది ఆర్థిక సంస్థలకు సురక్షితమైనది. బులియన్ లేదా కాయిన్ గోల్డ్‌కు సాధారణంగా ఇలాంటి రుణ సదుపాయాలు లభించవు.

ఆభరణాల కొనుగోలులో ప్రధాన సమస్య మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్. దీనికి పరిష్కారంగా గోల్డ్ స్కీమ్‌లను ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. కంపెనీస్ యాక్ట్ 2012 ప్రకారం నడిచే ఈ స్కీమ్‌లు అడ్వాన్స్ పర్చేస్ స్కీమ్‌ల కిందకు వస్తాయి. నెలవారీ వాయిదాలు చెల్లించడం ద్వారా చివరిలో మేకింగ్ ఛార్జీలు లేకుండా ఆభరణాలను పొందవచ్చు. ఈ స్కీమ్‌లలో ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ, ఒక వ్యక్తికి వచ్చే నష్టం సాధారణంగా ఒకటి లేదా రెండు నెలల జీతం మాత్రమే ఉంటుందని, ఇది పెద్ద ఆర్థిక నష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

రెగ్యులేటెడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై జాగ్రత్త:

డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి ఆర్‌బీఐ లేదా సెబీ నియంత్రణలో లేనందున వాటిలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తున్నారు. గతంలో క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లు మూతపడటంతో చాలామంది తమ పెట్టుబడులను కోల్పోయారని గుర్తుచేశారు. అన్ రెగ్యులేటెడ్ స్పేస్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎటువంటి భద్రతా హామీ ఉండదు.

సావరిన్‌ గోల్డ్ బాండ్స్

సావరిన్‌ గోల్డ్ బాండ్స్ (SGBs) బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక సురక్షితమైన, లాభదాయకమైన మార్గం. ఇవి సంవత్సరానికి 2.5% అదనపు వడ్డీని అందిస్తాయి. ఎనిమిది సంవత్సరాల తర్వాత పన్ను రహితంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. భారత్ బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై, రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం SGBల వంటి పథకాలను ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో తిరిగి ప్రారంభమైతే ఇవి ఉత్తమ పెట్టుబడి మార్గం అని అన్నారు.

గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ (OD) సదుపాయం

బ్యాంకులు గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీ వద్ద ఉన్న ఆభరణాలను బ్యాంకులో పెట్టి, దానిపై ఓడీ లిమిట్ పొందవచ్చు. మీరు ఉపయోగించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించాలి. బ్యాంకు మీ బంగారాన్ని భద్రపరుస్తుంది.బీమా చేయిస్తుంది. ఇది అత్యవసర పరిస్థితులకు మంచి ఎంపిక.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, వివాహిత మహిళలు 500 గ్రాముల వరకు, అవివాహిత మహిళలు 250 గ్రాముల వరకు, పురుషులు 100 గ్రాముల వరకు ఆభరణాలను కలిగి ఉండవచ్చు. ఈ పరిమితుల వరకు ఆభరణాలను ఉంచుకోవాలని సూచిస్తారు. మొత్తం పెట్టుబడిలో 20% వరకు మాత్రమే బంగారంలో పెట్టాలని, ఒకే ఆస్తిపై పూర్తిగా ఆధారపడకూడదని తెలిపారు. భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఇతర మార్గాలను కూడా పరిశీలించాలని సూచించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం