Chanakya Niti: ఈ 3 విషయాలపై కోపిస్తే.. లక్ష్మీదేవి, విజయం దూరమవుతాయి!
Chanakya Neeti: విజయం, లక్ష్మీదేవి వ్యక్తి అనుచిత ప్రవర్తన వల్లే దూరమవుతాయని వివరించారు. కోపం మనిషికి పెద్ద శత్రువు అని స్పష్టం చేశారు. కోపం అనేది ఒక వ్యక్తికి తీరని నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించారు. జీవితంలో కోపాన్ని మించిన శత్రువు మరొకటి లేదని చెప్పారు. కోపంతో జరిగిన నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారత ఆర్థికశాస్త్ర, నీతి శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి చెందిన చాణక్యుడు మానవుల అనేక సమస్యలకు పరిష్కారాలను చూపారు. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో తెలియజేశారు. ఎలాంటి లక్షణాలు మనిషిని దిగజారుస్తాయో కూడా తెలిపారు. సంపదను పెంచుకునే అలవాట్లను గురించి చెప్పారు. అయితే, విజయం, లక్ష్మీదేవి వ్యక్తి అనుచిత ప్రవర్తన వల్లే దూరమవుతాయని వివరించారు. కోపం మనిషికి పెద్ద శత్రువు అని స్పష్టం చేశారు. కోపం అనేది ఒక వ్యక్తికి తీరని నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించారు. జీవితంలో కోపాన్ని మించిన శత్రువు మరొకటి లేదని చెప్పారు. కోపంతో జరిగిన నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి మనుషులు కావాలంటే..
పిల్లలు సహజంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. చాణక్యుడి ప్రకారం బాల్యం అనేది నేర్చుకునే దశ. తప్పులు వారి అభ్యాసంలో ఒక భాగం. మీరు చిన్న తప్పులకు కోపం తెచ్చుకున్నా లేదా పిల్లలను కఠినంగా శిక్షించినా.. భయం వారిలో ఆవహిస్తుంది. భయపడిన పిల్లవాడు తనను తాను బహిరంగంగా వ్యక్తపరచలేడు. వారి అభ్యాస సామర్థ్యం తగ్గిపోతుంది. పిల్లలకు ప్రేమ, ఓపికతో నేర్పించాలని చాణక్యుడు చెప్పారు. వారిని అప్యాయంగా చూసుకోవడం మంచి మనుషులుగా మారుస్తుంది.
పెద్దల అనుభవం, సలహా..
తరాల అంతరం కారణంగా.. మన పెద్దల మాటలు పాతవిగా.. సహేతుకం కానివిగా మనకు అనిపించవచ్చు. కానీ, చాణక్యుడు దీనిని తప్పుగా అని చెప్పారు. ఎందుకంటే పెద్దలు పుస్తకాలలో దొరకని ఆచరణాత్మక జీవిత అనుభవం ఉంటుంది. మీరు పెద్దలపై కోపంగా ఉన్నప్పుడు.. మీరు వారిని అగౌరవపర్చడమే కాకుండా.. వారి సంవత్సరాల అనుభవం నుంచి వారు నేర్చుకున్న పాఠాలను కూడా కోల్పోతారు. ఇది ఇంటి శ్రేయస్సు, శాంతికి భంగం కలిగిస్తుంది. కాబట్టి వారి మాటలను గౌరవంగా వినండి. వారి మీద కోపం చూపవద్దు. మీరు వారిని విభేదించినప్పటికీ.. గౌరవం, సహనాన్ని కాపాడుకోవడం తెలివైన పని అన్నారు.
ప్రతికూల పరిస్థితులలో..
జీవితం ఎప్పుడూ మన ప్రణాళికల ప్రకారం సాగదు. కొన్నిసార్లు మన నియంత్రణకు మించిన కష్ట సమయాలు తలెత్తుతాయి. ఎందుకంటే పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు కోపంగా ఉండటం.. అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. కోపం మనం ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది. అలాంటి పరిస్థితిలో చెదిరిన మనస్సుతో ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో తీసుకున్న నిర్ణయాలు మీ సమస్యలను పెంచుతాయి. సంక్షోభ సమాయాల్లో మీ మనస్సును శాంతంగా ఉంచుకోవాలని చాణక్యుడు సూచిస్తున్నాడు. సహనం, అవగాహన ప్రతికూల పరిస్థితుల చుక్కుముడి నంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తాయని వివరించారు. అందుకే కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని, సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని దూరం చేస్తాయని చాణక్యుడు స్పష్టం చేశాడు.
