Tollywood: నా బాడీ నా ఇష్టం.. ఆ విషయాలు మీకేందుకు.. ? బాడీ షేమింగ్ పై హీరోయిన్ సీరియస్..
కూలీ సినిమాతో దక్షిణాదిలో ఒక్కసారిగా పాపులర్ అయిన హీరోయిన్ రచిత రామ్. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటుంది. తాజాగా బాడీ షేమింగ్, ఉమెన్ సూసైడ్ అనే టాపిక్స్ పై తనదైన శైలీలో స్పందించింది.

కన్నడ బ్యూటీ రచితా రామ్ గురించి తెలిసిందే. అంతకు ముందు తమిళం, కన్నడ భాషలలో వరుస సినిమాల్లో నటించింది. కానీ ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున కాంబోలో వచ్చిన కూలీ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. విలన్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. దాదాపు పదేళ్లుగా సినీరంగంలో కొనసాగుతుంది. కానీ కూలీ సినిమా తర్వాతే ఆమె లైఫ్ మారిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
ఇటీవల ఓ సినిమా ప్రమోషనల్ వేడుకలో రచితా రామ్ మాట్లాడుతూ బాడీ షేమింగ్ టాపిక్ పై మాట్లాడింది. తాను కూడా బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నానని, దానిని తెలివిగా హ్యాండిల్ చేసినట్లు చెప్పుకొచ్చింది. . ‘మహిళలు ఎందుకు లావుగా ఉంటారు? వారి ఆరోగ్య సమస్యలు ఏమిటి?’ అనే అంశంపై ఆమె అద్భుతంగా మాట్లాడారు. బాడీ షేమింగ్ వల్ల ఆత్మహత్య చేసుకునే వారంతా ముర్ఖులు అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
“ప్రతి స్త్రీ శరీరం భిన్నంగా ఉంటుంది. PCOD, ఒత్తిడి కారణంగా బరువు పెరుగుతుంది. పీరియడ్స్ కు ముందు, ఆ తర్వాత మహిళల శరీరంలో మార్పులు వస్తుంటాయి. అందుకే ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేము.. అలాగే నిద్ర కూడా మన శరీరంపై ప్రభావం చూపుతుంది. ఎనిమిది గంటల నిద్ర కచ్చితంగా అవసరం. లేదంటే వాళ్ల బాడీలో మార్పులు వచ్చేస్తుంటాయి. నిద్ర లేకపోతే నా ముఖం చాలా ఉబ్బుగా కనిపిస్తుంది. తర్వాత సన్నగా మారిపోతుంది. ఇలాంటి సమస్యలు ప్రతి మహిళకు వస్తుంది. అందుకే ఇవన్నీ బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండాలి. ఇది నా శరీరం, నా ఇష్టం.. ఎందుకు లావు అయ్యాం, ఎందుకు సన్నబడ్డామో చెప్పక్కర్లేదు. మన ఆరోగ్యం గురించి ఇతరులకు అనవసరం” అంటూ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
