Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. వరస సెలవులతో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 8 గం. సమయం
వారాంతంలో వరస సెలవులు రావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో దర్శనానికి భక్తులు భారులు తీరారు. దీంతో దర్శనానికి 8 గంటలు సమయం పడుతుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వ భారీగా పెరిగిన భక్తుల రద్దీ. వారాంతం వరుసగా సెలవులు రావడంతో మల్లన్న దర్శనం కోసం భక్తులు క్షేత్రానికి పోటెత్తారు. పెరిగిన భక్తుల రద్దీతో క్షేత్రమంతా భక్త జనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువ జామున నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది . భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మల్లన్న దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటి కప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. వరుసగా సెలవులు రావడంతో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు