AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JN.1 Veriant: అలర్ట్.. మురుగునీటిలో JN.1 వేరియంట్ వైరస్.. జీర్ణవ్యవస్థపై మహమ్మారి దాడి..

ఈ కొత్త వేరియంట్ గురించి వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు ఈ కొత్త కరోనా జాతి.. JN.1 వేరియంట్ ప్రజల ఇళ్ల నుండి బయటకు వచ్చే మురుగునీటిలో వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ మనుషుల మలంలోంచి బయటకు వస్తోందని అర్థం. ఇది మునుపెన్నడూ జరగలేదు. ఇది ఇప్పుడు శ్వాసకోశ వ్యవస్థపై కాకుండా ప్రజల జీర్ణవ్యవస్థపై దాడి చేస్తుందనే విషయం స్పష్టమైంది.

JN.1 Veriant: అలర్ట్.. మురుగునీటిలో JN.1 వేరియంట్ వైరస్.. జీర్ణవ్యవస్థపై మహమ్మారి దాడి..
Jn.1 Variant
Surya Kala
|

Updated on: Dec 24, 2023 | 10:23 AM

Share

చైనాలో 2019 చివరిలో కరోనా వెలుగులో వచ్చింది. అనంతరం ఈ మహమ్మారి 2020 సంవత్సరంలో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనను కలిగించింది. ఆర్థిక వ్యవస్థను నిలిపివేసింది. కరోనా మీద పోరాటం చేయడానికి ప్రపంచం మొత్తం కలిసి అనేక రకాల వ్యాక్సిన్‌లను తయారు చేసింది. వ్యాక్సిన్ దాని ప్రభావాన్ని చూపడం ప్రారంభించిన తర్వాత క్రమంగా కరోనా కేసులు తగ్గాయి. 2023 నాటికి.. ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలించబడిందని అందరూ భావించారు. అయితే ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుండగా.. నేను ఉన్నానంటూ కరోనా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. చైనా నుండి మరొక మిస్టరీ వైరస్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వైరస్ ను ప్రారంభంలో న్యుమోనియాకి కొత్త రూపంగా చెప్పారు. అయితే కాలక్రమంలో ఈ వ్యాధి చాలా భయంకరంగా మారింది. మళ్ళీ ప్రజలు పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారు.

ఆసుపత్రుల పరిస్థితి 2019, 2020లో ఎలా ఉందో అలాగే మారింది. ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఆందోళనను పెంచింది. దీనిపై పలు దేశాలు హెచ్చరికలను జారీ చేశాయి. ఆ దేశాల్లో భారత దేశం కూడా చేర్చబడింది. ఇటీవల కరోనాకు సంబంధించి నిపుణులు చెప్పిన విషయాలు  షాకింగ్‌గా ఉన్నాయి. కొత్త కేసుకు సంబంధించి బయటకు వచ్చిన డేటా ప్రకారం జలుబు, దగ్గుకు బదులుగా కరోనా ఇప్పుడు ప్రజల కడుపుపై ​​దాడి చేస్తుందని తెలుస్తోంది.

కరోనా ఇప్పుడు జీర్ణవ్యవస్థపై దాడి చేస్తుందా?

ఈ కొత్త వేరియంట్ గురించి వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు ఈ కొత్త కరోనా జాతి.. JN.1 వేరియంట్ ప్రజల ఇళ్ల నుండి బయటకు వచ్చే మురుగునీటిలో వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ మనుషుల మలంలోంచి బయటకు వస్తోందని అర్థం. ఇది మునుపెన్నడూ జరగలేదు. ఇది ఇప్పుడు శ్వాసకోశ వ్యవస్థపై కాకుండా ప్రజల జీర్ణవ్యవస్థపై దాడి చేస్తుందనే విషయం స్పష్టమైంది. మిస్సౌరీ విశ్వవిద్యాలయంలో మాలిక్యులర్ వైరాలజిస్ట్, మాలిక్యులర్ మైక్రోబయాలజీ , ఇమ్యునాలజీ ప్రొఫెసర్ మార్క్ జాన్సన్ DailyMail.comతో మాట్లాడుతూ ‘ఐరోపాలోని వ్యర్థ జలాల్లో అంటువ్యాధికి సంబంధించిన కొన్ని కొత్త వైవిధ్యాలు కనుగొనబడిన తర్వాత తమ దృష్టిని ఆకర్షించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

సమాచారం కోసం ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్ ఐరోపాలో ధృవీకరించబడింది. అయితే ఇతర దేశాల్లో కూడా పెరుగుతున్న కొత్త వేరియంట్ కరోనా కేసులను చూసి శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించారు. ప్రజల జీర్ణ ఎంజైమ్‌లను పరీక్షించడం ప్రారంభించాలని యోచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో