Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. పలు నకిలీ వెబ్ సైట్లను గుర్తించిన టీటీడీ విజిలెన్స్..
Tirumala Temple Online Tickets: అడ్డదారుల్లో డబ్బు సంపాదనకు దేవుడిని కూడా ఉపయోగించుకుంటున్నారు కొందరు. సాక్షాత్తు కలియుగ దైవం కొలువైన తిరుమల(Tirumala) శ్రీవారి పేరుతోనే కొందరు..
Tirumala Temple Online Tickets: అడ్డదారుల్లో డబ్బు సంపాదనకు దేవుడిని కూడా ఉపయోగించుకుంటున్నారు కొందరు. సాక్షాత్తు కలియుగ దైవం కొలువైన తిరుమల(Tirumala) శ్రీవారి పేరుతోనే కొందరు మోసాలు చేస్తున్నారు. స్వామివారి భక్తులకు దర్శనం టికెట్ పేరుతో భక్తుల్ని నిండా ముంచుతున్నారు కొందరు. కరోనా వైరస్(Corona Virus) వెలుగులోకి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలంటే.. ఆన్ లైన్ (Online) లో దర్శనం టోకెన్ ను ముందుగా తీసుకోవాలి అనే నిబంధనను టిటిడీ(TTD) అమలు చేస్తోంది. దీంతో స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఆన్ లైన్ లో టిటిడీ టికెట్స్ రిలీజ్ చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రిలీజ్ చేసిన వెంటనే టోకెన్లు అయిపోతున్నాయి. దీంతో ఎంతోమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. దీనిని కొంతమంది అవకాశంగా తీసుకుని తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసగిస్తూ నకిలీ వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి. ఈ నకిలీ వెబ్ సైట్లకు టిటిడీ విజిలెన్స్ చెక్ పెట్టింది. వివరాల్లోకి వెళ్తే..
ఈ మధ్యకాలంలో తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో పెద్ద ఎత్తున వెలుగుచూసిన నకిలీ టికెట్ల విక్రయంపై అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగం, టిటిడి విజిలెన్స్ విభాగం అప్రమత్తమైంది. స్వామివారి దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న దాదాపు 39 ఫేక్ వెబ్ సైట్లను టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. వెంటనే గూగుల్ యాజమాన్యంతో చర్చించి మోసపూరిత వెబ్ సైట్ ల తొలగించింది. ఇదే విషయంపై అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్పందిస్తూ.. 17 మంది దళారుల పై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు స్వామి దర్శనం పేరుతో దళారుల మాటలను నమ్మి మోస పోకుండా టిటిడి అధికారిక వెబ్ సైట్ ద్వారా సేవా టికెట్లు పొందాలని ఎస్పీ అప్పలనాయుడు సూచించారు.
Also Read: సపోర్టింగ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో.. నేడు రవితేజ పుట్టిన రోజు.. మొదటి అవకాశం ఎలా వచ్చిందంటే..