AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Mullapudi: టీటీడీ ఎల్ఏసి సభ్యునిగా టాలీవుడ్ ప్రొడ్యూసర్.. ముళ్లపూడి మోహన్‌ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ

ముళ్లపూడి మోహన్ గతంలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూటర్ చేశారు. ప్రస్తుతం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు హానరబుల్ సెక్రెటరీ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా  శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్‌నగర్‌ లో టీటీడీ నిర్మించిన దేవాలయాల అభివృద్ధి చేసే విధంగా కమిటీని ఏర్పాటు చేస్తుంది

Mohan Mullapudi: టీటీడీ ఎల్ఏసి సభ్యునిగా టాలీవుడ్ ప్రొడ్యూసర్.. ముళ్లపూడి మోహన్‌ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ
Tirumala Tirupati
Surya Kala
|

Updated on: Nov 11, 2023 | 8:48 AM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మం వైపు అందరూ అడుగులు వేసేలా.. దేవాలయం ఆధ్యాత్మిక పవిత్రత ప్రతి ఒక్కరికీ చేరేలా తిరుమల తిరుపతిలోని శ్రీవారి ఆలయం తరహా వివిధ ప్రాంతాల్లో ఆలయాలను నిర్మిస్తున్నారు. శ్రీవారి ఆలయాల్లో సమర్ధవంతమైన పనితీరుతో ఆలయాలను నిర్వహించడానికి టీటీడీ బోర్డు కొందరు సభ్యులను నియమిస్తుంది. తదగుణంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నూతన కమిటీ సభ్యున్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా శ్రీ వేంకటేశ్వర దేవాలయాలు, జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్‌నగర్ లోకల్ అడ్వైజరి కమిటీ సభ్యునిగా టాలీవుడ్ నిర్మాత ముళ్ళపూడి  మోహన్ ని నియమించినట్లు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ముళ్లపూడి మోహన్ గతంలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూటర్ చేశారు. ప్రస్తుతం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు హానరబుల్ సెక్రెటరీ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా  శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టారు.

హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్‌నగర్‌ లో టీటీడీ నిర్మించిన దేవాలయాల అభివృద్ధి చేసే విధంగా కమిటీని ఏర్పాటు చేస్తుంది. మరోవైపు కరీంనగర్‌లో నిర్మిస్తున్న శ్రీవారి కొత్త ఆలయానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణ పనుల కోసం లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా చేపట్టిన బాధ్యతలను ముళ్లపూడి మోహన్ నిర్వహించనున్నారు. ఆయన దేవాలయం  ఆధ్యాత్మిక పవిత్రత, ఆర్థిక పారదర్శకత.. సమర్థవంతమైన పనితీరును నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..