AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Horoscope: దీపావళి ఈ 4 రాశులకు అదృష్టాన్ని తెస్తుంది.. పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి..

సిక్కు మతంలో దీపావళి రోజున సిక్కుల ఆరవ గురువు హరగోవింద్ సింగ్ జైలు నుండి విడుదలయ్యాడని దీపావళి జరుపుకుంటే..  జైనమతంలోని తీర్థంకరుడైన మహా వీరుడు ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున మోక్షం పొందిన రోజుగా దీపావళిని మూడు రోజులు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ దీపావళి పండగ కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెలుస్తుంది. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

Diwali Horoscope: దీపావళి ఈ 4 రాశులకు అదృష్టాన్ని తెస్తుంది.. పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి..
Deepavali Horoscope
Surya Kala
|

Updated on: Nov 11, 2023 | 6:59 AM

Share

హిందువుల అతిపెద్ద పండుగ దీపావళి. దేశ విదేశాల్లో ఉన్న హిందువులు దీపావళి వేడుకలను ఘనంగా  జరుపుకుంటారు. హిందువులు దీపావళిని ఆశ్వయుజ మాస అమావాస్య రోజున జరుపుకుంటారు. శ్రీరాముడు రావణుడిని ఓడించి సీతా లక్ష్మణులతో అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా కొందరు శ్రీ కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజుగా మరికొందరు జరుపుకుంటారు. దీపావళి పర్వదినాన్ని హిందువులు మాత్రమే కాదు..  సిక్కులు, బౌద్ధులు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

సిక్కు మతంలో దీపావళి రోజున సిక్కుల ఆరవ గురువు హరగోవింద్ సింగ్ జైలు నుండి విడుదలయ్యాడని దీపావళి జరుపుకుంటే..  జైనమతంలోని తీర్థంకరుడైన మహా వీరుడు ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున మోక్షం పొందిన రోజుగా దీపావళిని మూడు రోజులు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ దీపావళి పండగ కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెలుస్తుంది. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మేషరాశి: దీపావళి ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ రాశివారి ఆరోగ్యం బాగుంటుంది. ఉపాధిలో మంచి అవకాశం వస్తుంది. కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు లేదా ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్రిదోష కారణంగా ఆరోగ్య చికాకులు ఏర్పడవచ్చు. అయితే మొత్తంమీద దీపావళి ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యాపారులకు, ఉద్యోగస్తులకు పురోభివృద్ధి కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ప్రభుత్వ ఉద్యోగస్థులు లాభపడతాయి. ఆరోగ్యంలో స్వల్ప తేడాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో చేసిన పనులు ఫలితాలను ఇవ్వడం మొదలవుతాయి. వ్యాపార నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం దీపావళి ఈ రాశివారికి శుభవార్త వినేలా చేస్తుంది.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి సేవకుల నుండి ప్రయోజనాలు లభిస్తాయి. ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు డిగ్రీ, అధికారాలు లభిస్తాయి. సాధువులను కలుస్తారు లేదా స్నేహం చేస్తారు. ప్రభుత్వం నుండి సహాయం పొందుతారు, భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూ సంపాదన అభివృద్ధి చెందుతుంది. మీ పనికి తగిన గౌరవం ఈ రాశికి చెందిన వారికి దీపావళి నుంచి లభిస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు దీపావళి తర్వాత ముఖ్యమైన సంక్లిష్టమైన సమస్యను సులభంగా పరిష్కరిస్తారు.  కోరుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారు. అవమాన భయం ఉన్నప్పటికీ విలాసవంతమైన జీవనశైలిని అభివృద్ధి చేకుంటారు. దీపావళి 2023 ఈ రాశికి మరింత అదృష్టాన్ని ఇస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ