Bedroom Vastu Tips: ఈ వాస్తు టిప్స్ ని సరిగ్గా ఫాలో అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది!

దంపతుల మధ్య సాధారణంగా చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు అనేవి కామన్ విషయం. కానీ అవి మరీ ఎక్కువగా పెరిగితే మాత్రం మనస్సు అస్సలు ప్రశాంతంగా ఉండదు. ఈ ఎఫెక్ట్ ఇతర వాటిపై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మరీ జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే బెడ్ రూమ్ కి సంబంధించిన కొన్ని వాస్తు టిప్స్ పాటించడక పోవడం వల్లనే ఈ సమస్యలు వస్తూంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న దోషాలతో దంపతుల మధ్య..

Bedroom Vastu Tips: ఈ వాస్తు టిప్స్ ని సరిగ్గా ఫాలో అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది!
Bedroom Vastu Tips
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2023 | 9:59 PM

దంపతుల మధ్య సాధారణంగా చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు అనేవి కామన్ విషయం. కానీ అవి మరీ ఎక్కువగా పెరిగితే మాత్రం మనస్సు అస్సలు ప్రశాంతంగా ఉండదు. ఈ ఎఫెక్ట్ ఇతర వాటిపై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మరీ జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే బెడ్ రూమ్ కి సంబంధించిన కొన్ని వాస్తు టిప్స్ పాటించడక పోవడం వల్లనే ఈ సమస్యలు వస్తూంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న దోషాలతో దంపతుల మధ్య దూరం పెరుగుతుందని.. వాటిని సరి చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బెడ్ రూమ్ లో నలుపు రంగు వస్తువులు అస్సలు పెట్టకండి:

పడక గదిలో నలుపు రంగులో ఉండే వస్తువుల్ని అస్సలు పెట్ట కూడదట. ఈ వస్తువుల ఎఫెక్ట్ మనసుపై అధికంగా పడి.. మనసుకు చిరాకుగా కలిగించి, గొడవలకు కారణం అవుతుంది. అలాగే బెడ్ రూమ్ ని చూడగానే ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించాలి. బెడ్ రూమ్ చిందరవందరగా ఉంటే చిరాకు పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా లోపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మంచం కింద ఎలాంటి వస్తువులు ఉండకూడదు:

వీలైనంత వరకూ బెడ్ రూమ్ లోని మంచం కింద ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. బెడ్ కింద నీటిగా ఉంచుకోవాలి. చెత్త చెదారం పేరుకు పోకుండా చూడండి. అలాగే ఇనుప వస్తువులు, చెప్పులు కూడా పెట్ట కూడదు. దీని వ్లల నిద్ర సరిగ్గా పట్టదు. భార్య భర్త లమధ్య గొడవలకు కారణం అవుతాయి.

ఇలాంటి ఫొటోలు, పెయింటింగ్స్ పెట్టకండి:

పడక గదిలో విషాదంగా ఉండే ఫొటోలు, బొమ్మలు, పెయింటింగ్స్ వంటివి ఏమీ ఉంచకూడదు. వీటి వల్ల దంపతుల మధ్య దూరం పెరగవచ్చు.

మొక్కలు:

బెడ్ రూమ్ లో అసలు ఎలాంటి మొక్కలు పెట్టకండి. వీటి ప్రభావం కూడా దంపతుల కాపురంపై పడే అవకాశాలు ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్ వస్తువులు పెట్టకండి:

బెడ్ రూమ్ లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా పెట్టకూడదు. టీవీ, ల్యాప్ ట్యాప్స్ వంటి వాటిని దూరంగా ఉంచండి. వీటి వల్ల కూడా భార్యాభర్తల మధ్య సరైన విధంగా సఖ్యత ఉండదు.

సెల్ ఫోన్స్ దూరంగా పెట్టండి:

ముఖ్యంగా సెల్ ఫోన్స్ వల్ల ఎంతో మంది భార్యభర్తలు విడిపోయారు. సెల్ ఫోన్స్ వాడకం వల్ల మనస్పర్థలు వచ్చి విడిపోతున్నారు. వీటిని దగ్గర పెట్టుకుని పడుకోవడం వల్ల కూడా అనేక రకాల మానసిక సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకూ రాత్రి పడుకునే ముందు సెల్ ఫోన్స్ కి దూరంగా ఉండండి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.