Eggs Vada: ఎగ్ వడలను ఇలా చేశారంటే.. ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది!
సాధారణంగా కోడి గుడ్లతో ఎన్నో రక రకాల వంటలను తయారు చేస్తాం. అలాగే ఎగ్ ఉపయోగించి చాలా రకాల స్నాక్స్ కూడా ఉంటాయి. ఎగ్ తో కూరలు చేసినా, స్నాక్స్ చేసినా, ఫ్రైడ్ రైస్ లు చేసినా ఎంతో టేస్టీగా ఉంటాయి. కోడి గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈసారి కోడి గుడ్లతో వడలు చేయండి.. ఆలోచించకుండా మొత్తం లాగించేస్తారు. ఎగ్ తో వడలు ఎలా అనుకుంటున్నారా.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి వీటిని టేస్ట్ చేశారంటే..
సాధారణంగా కోడి గుడ్లతో ఎన్నో రక రకాల వంటలను తయారు చేస్తాం. అలాగే ఎగ్ ఉపయోగించి చాలా రకాల స్నాక్స్ కూడా ఉంటాయి. ఎగ్ తో కూరలు చేసినా, స్నాక్స్ చేసినా, ఫ్రైడ్ రైస్ లు చేసినా ఎంతో టేస్టీగా ఉంటాయి. కోడి గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈసారి కోడి గుడ్లతో వడలు చేయండి.. ఆలోచించకుండా మొత్తం లాగించేస్తారు. ఎగ్ తో వడలు ఎలా అనుకుంటున్నారా.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి వీటిని టేస్ట్ చేశారంటే.. మళ్లీ మళ్లీ చేయంటారు. వీకెండ్స్ లో, పండుగల సమయంలో వీటిని చేసుకుని తింటే పండుగ టైమ్ ని కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మరి కోడి గుడ్ల వడలను ఎలా తయారు చేస్తారు? ఎగ్ వడల తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎగ్ వడలకు కావాల్సిన పదార్థాలు:
కోడి గుడ్లు, శనగ పిండి, బ్రెడ్ క్రంబ్స్, కారం, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తి మీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, నూనె.
ఎగ్ వడల తయారీ విధానం:
ఎగ్ వడలు తయారు చేసుకోవడానికి ముందుగా కోడి గుడ్లను ఉడికించి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను, పచ్చి మిర్చి, కొత్తి మీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు లోతైన పాత్రను తీసుకుని.. అందులో కాస్త లావుగా తురిమి పెట్టుకున్నా లేదా కట్ చేసుకున్న గుడ్ల ముక్కలను తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా శనగ పిండి, కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పైన చెప్పిన పదార్థాలన్నీ వేసుకోవాలి. అలాగే ఒక కోడి గుడ్డు కూడా వేసుకుని వడల మిశ్రమాన్ని బాగా కలుపు కోవాలి.
ఈ లోపు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక.. పక్కన పెట్టిన మిశ్రమాన్ని వడల మాదిరిగా వత్తుకుని.. బ్రెడ్ క్రంబ్స్ లో అద్ది.. వేడి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై లోపల ఉడికేలా ఉడికించుకోవాలి. రెండు వైపులా ఎర్రగా వేగాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. దీన్ని టమాటా సాస లేదా మైనీస్ తో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కోడి గుడ్లతో అప్పటికప్పుడు స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. మరింకెందుకు మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది.