AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రాత్రి పడుకునే ముందు నీళ్లను ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

నీరు అనేది చాలా ముఖ్యం. మనిషి ప్రతీ అవసరాన్ని తీర్చేది నీళ్లే. నీరు లేనిదే ఏ పనీ పూర్తి కాదు. వాటర్ తాగకుండా కూడా ఏ మనిషి ఎక్కువ కాలం బ్రతకలేడు. శరీరంలో మలినాలను బయటకు పంపాలన్నా.. ఆరోగ్యం ఉండాలన్నా నీరు ఎంతో అవసరం అవుతుంది. కనీసం రోజుకు మూడు లీటర్ల నీళ్లు అయినా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతూంటారు. అయితే నీటిని ఎలా తాగాలనేదానిపై ఎన్నో క్లారిటీలు వచ్చినా.. కొన్ని అపోహలు మాత్రం పోవడం లేదు. తాజాగా మరో విషయం..

Health Tips: రాత్రి పడుకునే ముందు నీళ్లను ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Drinking Water
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 08, 2023 | 9:40 PM

Share

నీరు అనేది చాలా ముఖ్యం. మనిషి ప్రతీ అవసరాన్ని తీర్చేది నీళ్లే. నీరు లేనిదే ఏ పనీ పూర్తి కాదు. వాటర్ తాగకుండా కూడా ఏ మనిషి ఎక్కువ కాలం బ్రతకలేడు. శరీరంలో మలినాలను బయటకు పంపాలన్నా.. ఆరోగ్యం ఉండాలన్నా నీరు ఎంతో అవసరం అవుతుంది. కనీసం రోజుకు మూడు లీటర్ల నీళ్లు అయినా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతూంటారు. అయితే నీటిని ఎలా తాగాలనేదానిపై ఎన్నో క్లారిటీలు వచ్చినా.. కొన్ని అపోహలు మాత్రం పోవడం లేదు. తాజాగా మరో విషయం చర్చకు వస్తోంది. రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదని చెబుతున్నారు. మరి రాత్రి పూట నీటిని ఎక్కువగా తాగితే ఏం జరుగుతుంది? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

నీరు ఎంత తాగితే అంత మంచిది. కానీ తాగే సమయంలోనే తాగాలి. అప్పుడు శరీరానికి కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే అందంగా ఉండటంలో కూడా నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది. నీరు తీసుకుంటే చర్మం తేమగా, హైడ్రేట్ గా ఉంటుంది. కాంతి వంతంగా తయారవుతుంది. ఉదయం లేవగానే నీటిని తీసుకోవడం చాలా బెటర్. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా నీటిని తాగ కూడదు.

రక్త పోటు – షుగర్ ఉన్నవారు:

ఇవి కూడా చదవండి

షుగర్ వ్యాధి, రక్త పోటు, గుండె సమస్యలు ఉన్నవారు రాత్రి పూట నీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తాగకూడదు. రాత్రి పూట నీటి శాతాన్ని తగ్గకుండా తీసుకోవాలి. లేకుంటే నిద్ర సరిగ్గా పట్టదు. అలాగే మూత్ర విసర్జన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.

పొట్ట నిండా తాగకూడదు:

రాత్రి పడుకునే ముందు నీటిని ఎక్కువగా తాగడం వల్ల నిద్రకు ఆటంకం వస్తుంది. మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. పొట్ట నిండా నీటిని తాగి పడుకోవడం వల్ల శ్వాస సరగ్గా ఆడదు. అంతే కాకుండా గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పడుకునే అరగంట ముందు ఓ గ్లాస్ వాటర్ ని తాగాలి. మధ్యలో బాగా దాహం అనిపిస్తే అప్పుడు తాగాలి.

ఇలా తాగవచ్చు:

రాత్రి పూట మితంగా వాటర్ ను తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న మలినాలు అన్నీ బయటకు పోతాయి. అలాగే చర్మం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలో వేడి చేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి