AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vasant Panchami: అదృష్టం, విజయాన్ని పొందడానికి నేడు దేవగురు బృహస్పతిని ఇలా పూజించండి

వసంత పంచమి నాడు సరస్వతి, బృహస్పతి లను మాత్రమే కాదు బుధ, శుక్రుల అనుగ్రహాన్ని పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీ జాతకంలో బుధ గ్రహానికి సంబంధించిన దోషం ఉంటే.. దానిని తొలగించడానికి, ఈ రోజు సరస్వతి దేవి పూజలో ఆకుపచ్చ పండ్లు,  నెమలి ఈకలను సమర్పించండి.

Vasant Panchami: అదృష్టం, విజయాన్ని పొందడానికి నేడు దేవగురు బృహస్పతిని ఇలా పూజించండి
Vasanta Panchami
Surya Kala
|

Updated on: Jan 26, 2023 | 12:39 PM

Share

సనాతన హిందూ సంప్రదాయంలో అనేక దేవతలు, దేవుళ్ళు.. పండగలు, పర్వదినాలు.. ఈరోజు మాఘమాసం శుక్లపక్షం ఐదవ రోజు.  ఈరోజు వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈ పండుగను సరస్వతీ పూజ అని కూడా అంటారు. ఈ రోజున జ్ఞాన దేవత సరస్వతి దేవి  ఆవిర్భవించిందని నమ్ముతారు. అంతేకాదు దేవతల గురువైన బృహస్పతి జన్మదినం అని కూడా నమ్మకం. మనిషికి సుఖ సంతోషాల కోసం సరస్వతి దేవి ఆరాధనతో పాటు.. బృహస్పతి ఆరాధన ఉత్తమం..

పూజలో ఏ వస్తువులను ఉపయోగించాలంటే..  దేవగురు బృహస్పతిని పూజించేటప్పుడు పసుపు రంగు వస్తువులను ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పూజ చేసేటప్పుడు తప్పకుండా పసుపు పూలు, పసుపు రంగు దుస్తులు, పసుపు రంగు మిఠాయిలు సమర్పించండి. ఎందుకంటే ఈ రోజు వసంత పంచమి.. కనుక పసుపు రంగున పూజలో ఉపయోగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు పసుపు బట్టలు ధరించడానికి ప్రయత్నించండి.

పసుపు, కుంకుమ  గురువారం నాడు శ్రీమహావిష్ణువు ఆశీస్సులు పొందాలంటే పూజలో కుంకుమ, పసుపును తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల భక్తులు త్వరితగతిన విజయాన్ని పొందుతారని.. చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని నమ్ముతారు. ఈ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు నుదుటిపై పసుపు లేదా కుంకుమ తిలకం ధరించండి.

ఇవి కూడా చదవండి

దానధర్మాలు  దానానికి, దక్షిణకు కూడా గురువారం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు ఆలయానికి వెళ్లి పూజించండి. దీని తరువాత, అవసరమైన వ్యక్తికి దానం చేయండి. దానధర్మాలలో బెల్లం, పప్పు, పసుపు బట్టలు మొదలైనవి సమర్పించండి.

వసంత పంచమి రోజున దేవగురు బృహస్పతితో పాటు విష్ణువును కూడా పూజిస్తారని హిందూ మతంలో నమ్ముతారు. మీ జీవితంలోని సమస్యలు తొలగిపోవాలంటే గురువారం నాడు చిటికెడు పసుపు నీటిలో వేసి స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించండి. పసుపు రంగును ఉపయోగించడం వల్ల విష్ణువు త్వరగా సంతోషిస్తాడని విశ్వాసం.

బుధ, శుక్రులకు పరిహారం వసంత పంచమి నాడు సరస్వతి, బృహస్పతి లను మాత్రమే కాదు బుధ, శుక్రుల అనుగ్రహాన్ని పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీ జాతకంలో బుధ గ్రహానికి సంబంధించిన దోషం ఉంటే.. దానిని తొలగించడానికి, ఈ రోజు సరస్వతి దేవి పూజలో ఆకుపచ్చ పండ్లు,  నెమలి ఈకలను సమర్పించండి. అలాగే జాతకంలో శుక్రగ్రహ దోషం వల్ల మీ సంతోషం-ఐశ్వర్యం, సంతోషకరమైన వైవాహిక జీవితంలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే, వాటిని తొలగించుకోవడానికి, మీరు ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులను సమర్పించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)